Site icon HashtagU Telugu

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఈ పండ్లను తినాల్సిందే!

Weight Loss

Weight Loss

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా సొంత పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొందరు నడవడానికి కూడా వీలు లేకుండా ఆయాస పడుతూ ఉంటారు. ఇకపోతే అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జిమ్ కి వెళ్లడం, ఎక్సర్సైజులు చేయడం, వ్యాయామాలు చేయడం, డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు.

అయితే అటువంటి సమయంలో కొన్ని రకాల పండ్లను తప్పనిసరిగా తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ పండ్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, కోరిందకాయలు వంటి అర కప్పు బెర్రీల్లో 32 కేలరీలను మాత్రమే కలిగి ఉంటాయి. ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారట. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయట. అలాగే యాపిల్స్ కూడా బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయట. యాపిల్స్ లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్ లో పెక్టిన్ చాలా ఉంటుంది. దీనిలో ఉండే కరిగే ఫైబర్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయట.

అంతేకాదు ఇవి మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే బొప్పాయి కూడా బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బొప్పాయిలో డైజెస్టివ్ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియను పెంచుతుందని చెబుతున్నారు. అలాగే నారింజ పండు కూడా బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఇందులో కేలరీలు తక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చట. బరువు తగ్గాలనుకునే వారు కివీ పండును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. ఈ పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కివీ పండ్లలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండు ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.