Site icon HashtagU Telugu

Fruits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ పండ్లను తినాల్సిందే!

Fruits

Fruits

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు కూడా తరచుగా పండ్లను తీసుకోమని చెబుతూ ఉంటారు. ప్రతిరోజు పండ్లు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అదేవిధంగా శరీరానికి అవసరమైన పోషకాలు విటమిన్లు కూడా అందుతాయి. దాంతో రోగాల ముప్పు కూడా తగ్గుతుంది. అయితే మనం తరుచూ తినే కొన్ని రకాల పండ్లు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయని అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ పండ్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆరెంజ్ పండులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఆకలి నియంత్రించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆపిల్ కూడా బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. యాపిల్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. తద్వారా దీని తీసుకోవడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. తరచుగా యాపిల్ తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలతో పాటు ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. అలాగే దానిమ్మ పండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట.

ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు ఫైబర్ వంటివి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయట. కివి పండు కూడా బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే నేరుగా తినేవాళ్లు నేరుగా తినవచ్చు లేదంటే ఎండబెట్టి కూడా తినవచ్చు అని చెబుతున్నారు. జామకాయ రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణ క్రియను మెరుగుపరిచే బరువు తగ్గడానికి ఎంతో బాగా సహాయపడుతుందని చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేవరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Exit mobile version