Menopause : మెనోపాజ్ టైంలో తినాల్సిన బెస్ట్ ఫుడ్స్

స్త్రీల జీవితంలో మెనోపాజ్ (Menopause)  దశ కీలకమైంది. స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందనడానికి మెనోపాజ్ ఒక సంకేతం.

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 08:00 PM IST

స్త్రీల జీవితంలో మెనోపాజ్ (Menopause)  దశ కీలకమైంది. స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందనడానికి మెనోపాజ్ ఒక సంకేతం. పన్నెండు నెలల పాటు (ఏడాది పొడవునా) పూర్తిగా పీరియడ్స్ రాకుండా ఉండడాన్నే మెనోపాజ్ అంటారు. మన దేశంలో 46 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వరకు ఈ దశ ఉంటుంది.

వాస్తవానికి పుట్టుకతోనే మహిళల అండాశయాల్లో కొన్ని లక్షల అండాలు ఉంటాయి. వయసుతో పాటు క్రమంగా అవన్నీ తగ్గుతూ ఉంటాయి. చివరిగా అడుగంటిపోతాయి. సరిగ్గా ఆ సమయం నుంచే మెనోపాజ్ లక్షణాలు బయటపడటం మొదలవుతాయ్. ఈ కీలకమైన టైంలో హార్మోన్లలో వచ్చే తేడాల కారణంగా మహిళల ఎమోషన్స్ లో కూడా మార్పులు వస్తాయి. వారు కొన్ని శారీరక ఇబ్బందులనూ ఫేస్ చేస్తారు. అండాశయాల నుంచి హార్మోన్ల విడుదల ఆగిపోవడం.. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. గుండె దడగా అనిపించడం, రాత్రి పూట చెమటలు పట్టడం, ఎక్కువసార్లు యూరిన్ కు వెళ్లడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఎముకలు బలహీన పడటం, బరువు పెరగడం లేదా తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇటువంటి మెనోపాజ్ లక్షణాలు నుంచి ఉపశమనం పొందడానికి లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి.

తీసుకోవాల్సిన ఫుడ్స్ లిస్ట్..

*  సాల్మన్ చేపలు
* పప్పులు
* గుడ్లు
* అవకాడో
* ఓట్స్
* జున్ను
* ఆకు కూరలు
* పుట్టగొడుగులు

* పాల ఉత్పత్తులు – Milk Products

పాల ఉత్పత్తులలో విటమిన్ డి, విటమిన్ కె, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం , మెగ్నీషియం వంటివి కలిగి ఉన్నందున వాటిని తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదే.

* గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌ – Green Leafy Vegetables

వీటిలో కాల్షియం, విటమిన్ కె కూడా ఉంటాయి. ఇవి మెనో పాజ్ దశలో శరీరానికి చాలా సహాయకారిగా ఉంటాయి.

* ఒమేగా 3 – Omega 3

చేపలు, అవిసె గింజలు మరియు చియా గింజలు వంటి ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

* ఫైబర్ – FIber

ఫైబర్ లోడ్ చేయబడిన తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

* ఫైటోఈస్ట్రోజెన్‌లు -Phytoestrogens 

బ్రోకలీ, కాలీఫ్లవర్, డార్క్ బెర్రీలు, చిక్‌పీస్ , సోయాబీన్స్ వంటి ఆహారాలను ఫైటోఈస్ట్రోజెన్‌లు అంటారు. ఇవి ఈస్ట్రోజెన్‌ను అనుకరించడం ద్వారా రుతుక్రమం ఆగిన లక్షణాలను మహిళల్లో తగ్గిస్తాయి.

* అవిసె గింజలు – chickpeas

కేవలం 40 గ్రాముల అవిసె గింజలు.. రుతుక్రమం ఆగిన స్త్రీలకు వైద్యులు సూచించే హార్మోన్ థెరపీకి సమానం . కాబట్టి వీటిని మీ డైట్‌లో మైదా పిండిలో, స్మూతీస్‌లో లేదా పప్పులో భాగంగా చేర్చుకోండి.

* ఇవి తినొద్దు

మెనోపాజ్ లక్షణాలను తీవ్రతరం చేసే ఆహారాలు కెఫిన్, ఆల్కహాల్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలు , స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే బెస్ట్.