Site icon HashtagU Telugu

Knee Pain: మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే?

Knee Pain

Knee Pain

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇదివరకు కేవలం వృద్ధులు వయసు మీద పడిన వారికి మాత్రమే ఈ మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం చిన్న వయసు వారు కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. మోకాలు నొప్పుల సమస్యలకు మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. మరి మోకాళ్ల నొప్పులు తగ్గడం కోసం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా మోకాళ్ళ నొప్పులు శరీరంలో క్యాల్షియం లేదా ప్రోటీన్ లోపిస్తే వస్తాయి. ఈ నొప్పికి తోడు మోకాళ్ల వాపు కూడా వస్తుంది. ఆకుకూరలు తరచుగా తింటూ ఉంటే ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే ఎటువంటి నొప్పులు కూడా రావు. అలాగే మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడేవారు గింజలు క్రమం తప్పకుండా తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్లు విటమిన్లు అందుతాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసి మోకాలి నొప్పులను కూడా తగ్గిస్తాయి. అలాగే మోకాలు నొప్పితో బాధపడేవారు ఆహారంలో అల్లం పసుపును చేర్చుకోవాలి. అల్లం పసుపు కలిపిన కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్ని రకాల పండ్లు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

అందులో ముఖ్యంగా స్ట్రాబెర్రీ నారింజ చెర్రీలు మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి లైకోపీన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పాలు లేదా పాల ఉత్పత్తులు తినడం వల్ల విటమిన్ డి తో పాటు కాల్షియం కూడా పుష్కలంగా అందిస్తుంది. ఎక్కువ కొవ్వు లేని పాలను తీసుకోవడం మంచిది.

Exit mobile version