Winter Foods: చలికాలంలో ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలట. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలోనే దీపావళి, క్రిస్‌మస్, సంక్రాంతి వంటి పండుగలు వస్తాయి. ఈ వేడుకల్లో తీపికరమైన ఫుడ్స్, స్వీట్స్ ఎక్కువగా తింటారు. అయిత ఇది ఇమ్యూనిటీ పవర్‌ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. షుగర్ ఇన్‌ఫ్లమేషన్ ని పెంచి ఇమ్యూనిటీని తగ్గిస్తుందట. దీంతో బ్రీతింగ్ డిజార్డర్స్ రిస్క్ పెరుగుతుందని చెబుతున్నారు.
అలాగే చలికాలంలో వేడివేడిగా మిర్చి బజ్జీలు, పకోడీలు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇవి చలి నుంచి రిలీఫ్ ఇస్తూ, రీఫ్రెషింగ్ ఫీలింగ్ ని ఇస్తాయట. అయితే క్యాలరీలు ఎక్కువగా ఉండే వీటిని తింటే బరువు అదుపు తప్పుతుందట. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయని,పైగా ఈ ఫుడ్స్‌లోని మసాలాలు గ్యాస్ట్రిక్ సమస్యను కలిగిస్తాయని చెబుతున్నారు. అలాగే శీతాకాలంలో బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి జ్యూస్ లు తాగుతుంటారు. అయితే చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ జ్యూస్ లు, షుగరీ డ్రింక్స్ శరీరానికి నష్టం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచి, ఇమ్యూనిటీ పవర్ ని తగ్గిస్తుందట. అందుకే ఫ్రూట్ జ్యూస్ లకు బదులుగా నేరుగా ఆ పండ్లను తినాలని చెబుతున్నారు. పాలు, పాల ఉత్పత్తులు గొంతులో శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయట. ఈ సీజన్ లో వీటిని పరిమితంగా తీసుకోవాలని, ఇది బ్రీతింగ్ తీసుకోవడాన్ని కష్టంగా చేసి ఇతర ఇన్‌ఫెక్షన్లకు గురిచేస్తుందని చెబుతున్నారు. భోజనం సమయంలో కూడా పెరుగును లిమిట్ చేయడం మంచిదట. పైగా, కొందరిలో పాల ఉత్పత్తులు అలర్జీకి కారణం అవుతాయి. కాబట్టి జలుబు, దగ్గుకు గురయ్యే వారు, స్కిన్ సెన్సిటివిటీ కలిగిన వారు వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే చలికాలంలో ప్రాసెసింగ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటి వాటికీ తప్పకుండా దూరంగా ఉండాలని చెబుతున్నారు.
Winter Foods: శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే.. లేదంటే?

Winter Foods