Site icon HashtagU Telugu

Food Items: ఈ ఆహార పదార్థాలను ప్రతి రోజూ తీసుకోకూడదు..!

Food Poison

Food Poision

కొన్ని రకాల ఆహార (Food) పదార్థాలను ప్రతి రోజూ తీసుకోవడం మంచిది కాదని చెబుతోంది. వీటిని భారమైన, ఘనమైన ఆహారాలని (Food) ఆయుర్వేద నిర్వచనం. అందుకనే వీటిని రోజూ కాకుండా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ‘‘మనం తీసుకునే ఆహారమే అత్యంత ప్రభావం చూపించే ఔషధం కావచ్చు. లేదంటే స్లో పాయిజన్ కూడా కావచ్చని’’ ఆయుర్వేదం చెబుతోంది.

ఫ్లాట్ బీన్స్:

ఆయుర్వేదం ప్రకారం ఫ్లాట్ బీన్స్ ఘనాహారం కిందకు వస్తుంది. దీన్ని రోజూ తీసుకుంటే వాత, పిత్త దోషాలు పెరుగుతాయి. వీర్య కణాల ఆరోగ్యానికి మంచిది కాదు. రక్తస్రావం సమస్యలు ఎదుర్కొనే వారికి అనుకూలం కాదు.

రెడ్ మీట్:

పంది మాంసం, గొడ్డు మాంసం, గొర్రె మాంసం రెడ్ మీట్ కిందకే వస్తాయి. ఇవి ఘనాహారం. మలబద్ధకానికి కారణమవుతాయి. వీటిని అదే పనిగా తీసుకునే వారికి బవెల్ కేన్సర్ రిస్క్ ఉంటుంది.

ఎండించిన కూరగాయలు:

సీజనల్ గా వచ్చే కొన్ని రకాల కూరగాయలను ఎండించి, ఏడాది పొడవునా కొన్ని ప్రాంతాల్లో వాడుకునే వారున్నారు. కానీ, ఇవి జీర్ణానికి కష్టమవుతాయి. దీంతో వాతదోషం పెరుగుతుంది.

పచ్చి ర్యాడిష్:

ఔషధ గుణాలుండే ముల్లంగిని పచ్చిగా తీసుకోకూడదు. థైరాయిడ్ పనితీరు, పొటాషియం స్థాయులపై దీని ప్రభావం పడుతుంది.

పులిసిన ఆహార పదార్థాలు:

పులిసిన ఆహారాలతో వేడి పెరుగుతుంది. పిత్త దోషం పెరుగుతుంది. రక్త సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. అందుకని పులియబెట్టిన ఆహారాలను రోజూ కాకుండా అప్పుడప్పుడు, కొన్ని రోజుల విరామంతో తీసుకోవచ్చు.

Also Read:  Microsoft: గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్

Exit mobile version