Site icon HashtagU Telugu

Eyesight: కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని తప్పకుండా తినాల్సిందే!

Eyesight

Eyesight

ఈ రోజుల్లో చిన్న పెద్ద అని వయసుతో సంబందం లేకుండా చాలామంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కంటి చూపు సమస్యకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఎక్కువగా వినియోగించడం కూడా ఒకటి. చిన్న వయసు నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా అలవాటు చేయడం వల్ల ఒక వయసు వచ్చేసరికి కంటిచూపు సమస్యతో బాధపడుతున్నారు. అలాగే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా ఈ కంటి చూపు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మీరు కూడా అలా కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నప్పుడు కొన్ని రకాల నేచురల్ టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.

మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యారెట్ లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కూరల రూపంలో కానీ లేదంటే పచ్చిగానే క్యారెట్ ని తీసుకోవడం వల్ల కంటిచూపు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే పాలకూర బ్రోకలి వంటి ఆకుపచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. వీటిలో విటమిన్ సి, ఈ , కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి. నారింజ పండ్లను కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి కంటిలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి కంటి సమస్యలను దూరం చేస్తుందట. అలాగే బ్లూ బెర్రీస్ అనేది కూడా అంతిమంగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇది మన కళ్ళను రక్షిస్తాయని చెబుతున్నారు.

అలాగే చీటిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది కంటి కండరాలను బలపరుస్తుంది. అవకాడోలో విటమిన్ ఈ, కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతున్నారు. అలాగే మొక్కజొన్నలో ల్యుటిన్, జియాక్సాంథిన్ అధికంగా ఉంటాయి. ఇవి మధ్య వయస్సు సంబంధిత కంటి సమస్యలను నిరోధిస్తాయి. అయితే కంటి చూపు సమస్యలతో ఇప్పటికే బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అధికంగా ఉప్పు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదంతో పాటు కంటిచూపు సమస్యలు కూడా వస్తాయట. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల కూడా కంటి చూపు మందగిస్తుందని చెబుతున్నారు. సంతృప్త కొవ్వులు రక్తనాళాలను అడ్డుపడేస్తాయి. ఇది కంటికి రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.