Site icon HashtagU Telugu

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే పరగడుపున తినకూడనివి, తాగకూడని ఆహార పదార్థాలివే?

Mixcollage 02 Jul 2024 07 59 Am 7864

Mixcollage 02 Jul 2024 07 59 Am 7864

ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కానీ కొంతమంది మాత్రం ఏది పడితే అది తింటూ లేనిపోని అనారోగ్య సమస్యలను ఏరి కోరి మరి తెచ్చుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా చాలామంది ఉదయం లేచిన వెంటనే ఏం తినాలి ఏం తినకూడదు అన్న విషయాలను పట్టించుకోకుండా ఏదో ఒకటి తింటే చాలు అన్నట్టుగా తినేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పరగడుపున ఏది పడితే అది తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పై అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.

మరి పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇలాంటి ఆహారం తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం ఎప్పుడు ఈజీగా జిర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా పొద్దున్నే తీసుకునే ఆహారంలో పుల్లటి వస్తువులను తీసుకోకూడదు. ముఖ్యంగా పుల్లటి పండ్లను ఉదయం తినడం ఏమాత్రం మంచిది కాదు. పుల్లటి పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కడుపులో అల్సర్స్ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఉదయం పరగడుపున ఆహారం తీసుకునేటప్పుడు చాలామంది పచ్చి కూరగాయలను తింటూ ఉంటారు.

అయితే ఇది కూడా అస్సలు మంచిది కాదు. ఈ విధంగా ఉదయం పచ్చి కూరగాయలు తినడం వల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుందని వీటిలో ఫైబర్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని, దీనివల్ల అవి జీర్ణం కాకుండా, అనవసరమైన అజీర్ణ సమస్యలు వచ్చి పొత్తికడుపులో నొప్పిగా ఉంటుంది. అలాగే ఉదయం పరగడుపున పొరపాటున కూడా చాక్లెట్లను, క్యాండీలను తినకూడదు. చాక్లెట్లు, అది మన క్లోమంపై దుష్ప్రభావాన్ని చూపి భవిష్యత్తులో కాలేయాన్ని బలహీనం చేసే ప్రమాదం ఉంటుందని క్యాండీలు తినడం వల్ల, వీటిలో చక్కెర కంటెంట్ ఉండడం వల్ల ఇవి ఆరోగ్యాన్ని బాగా పాడుచేస్తాయి.

ఇక ఉదయం పరగడుపున చాలామంది కాఫీలను, టీలను తాగుతూ ఉంటారు. అది కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే కాఫీ తాగడం కూడా ఏమాత్రం మంచిది కాదని కాఫీలో కెఫెన్ అనే పదార్థం ఉండడం వల్ల అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపి ఎసిడిటీకి కారణంగా మారుతుంది. అదేవిధంగా స్పైసీగా మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్ ని కూడా ఉదయాన్నే పరగడుపున తినరాదు. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం మొదలవుతుంది. అలాగే ఉదయాన్నే పరగడుపున అరటిపండును కూడా తినకూడదు.