Site icon HashtagU Telugu

Belly Fat: బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోవాలంటే భోజనానికి ముందు వీటిని తాగాల్సిందే!

Belly Fat

Belly Fat

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య కూడా ఒకటి. ఈ బెల్లీ ఫెయిర్ సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోయి చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డేట్లు ఫాలో అవ్వడంతో పాటు రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక మీదట ఆ పని చేయాల్సి పని లేదు. ఎందుకంటే భోజనానికి ముందు కొన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటే ఈజీగా ఈ బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఇంతకీ డ్రింక్స్ ఏవి? వాటిని ఎప్పుడు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే..

శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గితే బరువు తగ్గుతారు. ఇందుకోసం సరైన ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆకలి కంట్రోల్ అవుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. అదే విధంగా జీవక్రియ పెరిగితే బరువుని బ్యాలెన్ష్ చేయవచ్చు. సరైన ఫుడ్, డ్రింక్స్ జీవక్రియని గణనీయంగా పెంచుతుంది. కానీ భోజనానికి ముందు కొన్ని ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోంటే జీవక్రియ పెరుగుతుంది. భోజనానికి ముందు అవకాడో నట్స్ ఆలివ్ ఆయిల్ వంటి హెల్తీ ఫ్యాట్స్ ని తీసుకోవడం వల్ల కొద్దిగా తినగానే కడుపునిండిన ఫీలింగ్ వచ్చి ఎక్కువగా తినరు. కొవ్వు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కడుపు నిండుగా ఉంటుంది. దీంతో తక్కువగా తింటారు. బరువు కూడా తగ్గుతారు. అలాగే భోజనానికి ముందు వెజిటేబుల్ సూప్ తాగడం చాలా మంచిది. ఇలా తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారట. ఈ వెజిటేబుల్ సూప్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

దాంతో కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కువగా ఆహారం తినరు. అలాగే భోజనానికి ముందు తీసుకోవాల్సిన వాటిలో గ్రీన్ టీ కూడా ఒకటి. గ్రీన్ టీలో కాటెచిన్స్, కెఫిన్ వంటి సమ్మేళనాలు థర్మోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీంతో కేలరీలు బర్న్ అవుతాయి. గ్రీన్ టీని భోజనానికి ముందు తీసుకుంటే జీవక్రియ తక్కువ కేలరీల గ్రీన్ టీ శరీరాన్ని హైడ్రేట్ చేసి రిఫ్రెష్ చేస్తుందట. ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్, చేపలు, గుడ్లు, టోఫు, బీన్స్ తీసుకుంటే జీవక్రియ పెరుగుతుందట. కార్బోహైడ్రేట్స్, కొవ్వులతో పోలిస్తే ప్రోటీన్ జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందట. అదే విధంగా జీవక్రియ పెరిగి ద్రవ్యరాశిని కాపాడేందుకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది హెల్దీ జీవక్రియకి మంచిదని చెబుతున్నారు.