Flowers for Health : ఈ పూలు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి తెలుసా..

కొన్ని పూలను మన అందానికి(Beauty), ఆరోగ్యానికి(Health) కూడా వాడుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 10:00 PM IST

సాధారణంగా పూలను(Flowers) మన హిందూ సంప్రదాయ పరంగా దేవుడి(God) పూజకు, స్త్రీలు తలలో పెట్టుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే కొన్ని పూలను మన అందానికి(Beauty), ఆరోగ్యానికి(Health) కూడా వాడుకోవచ్చు.

గులాబీ పూలు(Rose Flowers) అంటే ఇష్టపడని వారు ఉండరు. గులాబీ పూలను ఎండబెట్టి లేకపోతే అలానే ఉంచి వాటిని స్వీట్ల తయారీలో కానీ టీలో కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వలన వాటి లోని క్యాన్సర్ ని దూరం చేసే గుణాలు మన శరీరంలోనికి వస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను కూడా మన శరీరంలో తగ్గిస్తాయి. అధిక బరువు ఉన్నవారు రోజూ ఏదో ఒక రూపంలో ఒక గులాబీ పువ్వును ఆహారంలో భాగంగా తీసుకుంటే బరువు తగ్గుతారు.

బొప్పాయి పూలతో చేసిన టీ తాగడం డెంగ్యూ లక్షణాలు తగ్గుతాయి. మధుమేహం ఉన్నవారికి ఈ టీ తాగడం మంచిది. ఈ టీ తాగడం వలన గుండె, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి.

అరటిపువ్వును ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన దీనిలోని ఫైబర్, విటమిన్ సి మన శరీరంలో రక్తం అధికంగా ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

మొరింగా పువ్వుతో టీ కాచుకొని తాగడం వలన అది మన శరీరంలోని కండరాజాలాన్ని మెరుగుపరుస్తాయి.

మాహువా అనే పువ్వును తేనె, జామ్, జ్యుస్ తయారుచేయడానికి వాడతారు. ఈ పూలతో కాచిన టీ తాగడం వలన శ్వాస సంబంధ సమస్యలు, గుండెకు సంబంధించిన జబ్బులు రావడం తగ్గుతాయి. కాబట్టి పైన చెప్పిన పూలతో టీ లేదా జామ్ వంటివి తయారుచేసుకొని మన ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇవే కాకుండా మరికొన్ని పూలు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మన ఆయుర్వేదంలో అనేక పూలతో చేసే వైద్యాలు కూడా ఉన్నాయి.

 

Also Read : Caffeine : కెఫీన్ కాఫీలో మాత్రమే కాదు.. మన శరీరంకు ఎంత కెఫీన్ శాతం దాటకూడదు..