Site icon HashtagU Telugu

Summer Skincare: వేసవికాలంలో చెక్కుచెదరని అందం మీ సొంతం కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Summer Skincare

Summer Skincare

వేసవికాలం వచ్చింది అంటే చాలు అనారోగ్య సమస్యలతో పాటు అందానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం జిడ్డుగా మారడం మొటిమలు రావడం చర్మం పొడిబారడం కమీలిపోవడం చర్మం పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ వేసవికాలంలో చర్మ రక్షణ కాస్త కష్టంగానే ఉంటుందని చెప్పాలి. పురుషులు అందంపై అండగా ఫోకస్ చేయకపోయినప్పటికీ స్త్రీలు మాత్రం అందర్నీ కాపాడుకోవడం కోసం పార్లర్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే చెక్కుచెదరని అందం మీ సొంతం అవుతుందని చెబుతున్నారు.

మరి అందుకోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. ​వేసవికాలంలో ఎండ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుందట. మృత కణాల కారణంగా, చర్మం డల్‌ గా కనిపిస్తుంది. ఇవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి, చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తాయట. దీంతో మొటిమలు, మచ్చలు వంటివి సమస్యలు వస్తాయట. అందుకే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేయడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. స్నానం చేయడానికి ముందు ఎసెన్షియల్ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి, మీ చర్మానికి సరిపోయే న్యాచురల్‌ స్క్రబ్‌ తో ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలట. కనీసం వారానికి రెండు సార్లైనా మీ చర్మాన్ని స్ర్కబ్‌ చేస్తే మృత కణాలు తొలగి ఫ్రెష్‌ గా కనిపిస్తుందట.

రోజుకు కనీసం మూడు సార్లు ఫేస్‌ వాష్‌ చేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుందట. వేసవి కాలంతో పోలిస్తే శీతాకాలం మీ చర్మం పొడిగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌ లో వాడే మాయిశ్చరైజర్ కాస్త ఆయిలీగా, హెవీగా ఉంటుందట. అటువంటి మాయిశ్చరైజర్‌ ఈ కాలానికి సరిపోదని చెబుతున్నారు. మీ డెర్మటాలజిస్ట్‌ ను కలిసి ఈ సీజన్‌ కు సరిపడా క్రీమ్‌ వాడాలట. ఇకపోతే వేసవికాలంలో ఏది మర్చిపోయిన కూడా సన్ స్క్రీన్ రాయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అని చెబుతున్నారు. వేసవిలో కేవలం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలని చెబుతున్నారు.

ఇది చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడమే కాదు, స్కిన్‌ ను తేమగా ఉంచడంలో సహాయపడుతుందట. మనం తీసుకునే ఆహారం సైతం మన అందాన్ని రక్షిస్తుందట. అందుకే వేసవి కాలంలో చర్మాన్ని తాజాగా మార్చుకోవడానికి, మెరిపించుకోవడానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే మామిడి, బెర్రీస్ వంటివి ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలట. అలాగే వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి తరచుగా డీహైడ్రేషన్ కు గురవుతూ ఉంటారు. చర్మం నిర్జీవంగా మారుతుంది. అయితే చర్మం నిగనిగలాడాలంటే హీరోయిన్ కి సరిపడా నీళ్లు తాగాలని చెబుతున్నారు.