Site icon HashtagU Telugu

Constipation: ఎన్ని చేసినా మలబద్దకం తగ్గడం లేదా.. అయితే ఈ పండ్లు తినాల్సిందే?

Mixcollage 24 Jul 2024 10 28 Am 3867

Mixcollage 24 Jul 2024 10 28 Am 3867

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చాలామంది ఈ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. చిన్నపిల్లల నుంచి ఈ పెద్ద వారి వరకు చాలామంది ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఆహారంలో మార్పుల కారణంగా, జీవనశైలిలో మార్పుల కారణంగా మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్య బారిన పడగానే చాలా మంది వైద్యులను సంప్రదిస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ సమస్య మరింత తీవ్రం అయ్యి ఆపరేషన్ చేయించుకునే వరకు కూడా వెళుతూ ఉంటుంది.
అలాగే ఈ సమస్య నుంచి బయటపడడానికి రకరకాల మందులను వాడుతుంటారు.

అయితే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మల బద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కాలి కడుపుతో బొప్పాయిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగువుతుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజు ఒక యాపిల్‌ తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవట.

వీటిలో ఉండే పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా మార్చడంలో ఉపయోగపడుతుంది. పేగులో చలనశీలతను పెంచుతుందట. దీంతో సుఖ విరేచనం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ద్రాక్ష కూడా మలబద్ధకాన్ని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్షలో ఉండే నీరు, ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని పరార్‌ చేయడంలో ఇది ఉపయోగపడుతుందట. అరటి పండ్లు కూడా మలబద్ధక సమస్యను దూరం చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందులోని పొటాషియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అలాగే పేగు చలనశీలతను పెంచుతుందట. అదేవిధంగా మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఆరంజ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుందట. ఇందులోని విటమిన్‌ సి, ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఆరెంజ్‌ కీలక పాత్ర పోషిస్తుందని, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.