Site icon HashtagU Telugu

Irregular Periods:ఇవి తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడమే కాదు…నొప్పి తగ్గుతుంది.!!

Irregular Periods

Irregular Periods

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణంగా పీరియడ్స్ క్రమంగా రావు. కొన్ని రకాల ఆహారపదార్థాలు నెలసరి సరిగ్గా అయ్యేలా చేస్తాయి. అంతేకాదు ఆ సయమంలో వచ్చే కడుపునొప్పిని కూడా తగ్గిస్తాయి. అవేంటో చూద్దాం.

కొంత మంది మహిళల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇదొక సాధారణ సమస్య. హార్మోన్ల అసమానతలే దీనికి ప్రధాన కారణం. దీంతోపాటుగా ఇతర కారణాలు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు దారితీస్తాయి. ఆకస్మాత్తుగా బరువు తగ్గడం, ఎక్కువ వ్యాయామం, కొన్ని రకాల మందులు వాడటం, నిద్రలేకపోవడం, ఒత్తిడి, పేవలమైన ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణం అవుతాయి.

అయితే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల పీరియడ్స్ అనేవి క్రమం తప్పుతాయి. PCOSహార్మోన్ల మార్పులు లేదా ఇన్సులిన్ హార్మోన్ల నిరోధకత కారణం వల్ల కూడా ఇలా జరగుతుంది. అధిక బరువుతోకూడా హార్మోన్ల నష్టానికి దారితీస్తుంది. అలాగే ఇన్సులిన్ స్థాయిలకు అంతరాయం కలుగుతుంది. ఈ హార్మోన్ల అసమతుల్యతే క్రమరహిత కాలాలకు కారణం అవుతాయి.

అధిక బరువు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణం అవుతాయి. అంతేకాదు మరెన్నో అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకే వీలైనంత వరకు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తినే ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

FOO
ఇందులో ఉండే కెరోటిన్ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను ఉత్తేపరుస్తుంది. దీంతో రుతుస్రావం నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
అల్లం :
పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ స్థాయిలను తగ్గించడంలో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు అలసటను నివారిస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను తొలగిస్తుంది.

దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో చాలా ఔషదగుణాలుంటాయి. దీన్ని ఆహారంలో తీసుకుంటే రుచితోపాటు…ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నొప్పి, రుతుస్రావం, వికారం, వాంతులు, వంటి సమస్యలను తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది.

బీట్ రూట్:
బీట్ రూట్ లో ఇనుము, ఫొలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ కూడా పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి.

పసుపు:
పసుపులో యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షలణాలు అధికంగా ఉంటాయి. పసుపు రుతుస్రావ నొప్పిని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను సరిచేయడానికి సహాయపడుతుంది. పాలలో అరటీస్పూన్ పసుపు కలిగి రోజూ తాగితే రుతుక్రమం క్రమంగా అవుతుంది.