Site icon HashtagU Telugu

Beer: బీర్లు తాగే ముందు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.. మగవారు రోజుకు ఎన్ని బీర్లు తాగాలంటే!

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఆల్కహాల్ కి అలవాటు పడ్డారు. యువత ముఖ్యంగా అభివృద్ధి వంటివి తాగుతూ పూర్తిగా చెడిపోయారు. 20 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఈ బీర్లు వంటివి తాగుతుండడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. అయితే బీర్లు తాగడం మంచిదే కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే బీరు తాగేటప్పుడు తప్పనిసరిగా ఆరు విషయాలను గుర్తించుకోవాలట. ఇంతకీ ఆ ఆరు విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బీర్లు తాగడం మంచిదే కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు.

బీరు తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుందని, మూత్ర పిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోతాయట. అలాగే ఇందులో పాలి ఫెనల్స్, విటమిన్స్, అమైనో ఆమ్లాలు ఉంటాయట. ఇవి మన శరీరంలోని లిపిడ్ ప్రొఫైల్‌ తో కలిసి గుండె సమస్యలు రాకుండా దోహదపడతాయట. అలాగే మితంగా బీర్లు తాగడం వల్ల మన శరీరానికి యాంటీ యాక్సిడెంట్లు, యాన్తి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చేరతాయట. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేయడంతో పాటు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, గుండె సంబంధిత జబ్బులు రాకుండా రక్షిస్తుందని చెబుతున్నారు. బీర్లు తాగడం వల్ల ఎంత మొత్తంలో ప్రయోజనాలు ఉన్నాయో, అంత కంటే ఎక్కువ మొత్తంలో దుష్ప్రయోజనాలు ఉన్నాయట. అధికంగా బీర్లు తాగేవారి కాలేయం దెబ్బతింటుందట. అలాగే విపరీతమైన బరువు పెరిగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

దీని కారణంగా చెడు కొవ్వు పెరిగిపోయి గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే బీర్ తాగడం వ్యసనంగా మారిపోయి ప్రతిరోజూ తాగకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. కాకపోతే బీరును ఒక ఔషధంగా భావించి ప్రతిరోజూ ఒక గ్లాస్ బీర్ తాగితే మాత్రం ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చట. బీరును మితిమీరి అధికంగా తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడతారని, అలాగే మూత్ర విసర్జనకు అధికంగా వెళ్లాల్సి వస్తుందని తద్వారా శరీరం లోని నీటి శాతం మొత్తం తగ్గిపోయ నోరు ఎండిపోతుంటుందని చెబుతున్నారు. అధికంగా బీరు తాగడం వల్ల క్యాలరీ కంటెంట్ పెరిగిపోతుంది. దీని వల్ల పొట్ట భాగంలో కొవ్వు బాగా పెరిగిపోతుంది. అలాగే ఆ కొవ్వు గుండెకు ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ మీరు బీరు తాగాలి అనుకున్న కూడా తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఉన్న బీర్లను మాత్రమే తాగాలి. అలాగే మగవారు రోజుకు రెండు గ్లాసుల బీర్ తాగాలట. అయితే ఆ బీర్‌ లో ఆల్కహాల్ తక్కువగా ఉండడం నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్ ఎక్కువగా ఉంటే మాత్రం కచ్చితంగా ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు.