Site icon HashtagU Telugu

Loose Weight: వారం రోజుల్లోనే బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి?

Loose Weight

Loose Weight

ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు, ఊబఖాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇది అధికబరువు సమస్యను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు వ్యాయామాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అధిక బరువు తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటివారు వారం రోజుల్లోనే ఈజీగా బరువు ఎలా తగ్గవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్ప్రింటింగ్.. రన్నింగ్ స్టైల్‌ తో కూడిన ఈ వ్యాయామం బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగ పడుతుందట. ఈ తీవ్రమైన వ్యాయామం జీవక్రియను పెంచుతుందని, అలాగే కేలరీలను కూడా త్వరగా బర్న్ చేస్తుందని చెబుతున్నారు. ఈ తీవ్రమైన వ్యాయామం ట్రెడ్‌మిల్‌ పై లేదంటే ఆరు బయట కూడా చేయవచ్చని, ఇది తక్షణమే బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు.

బార్బెల్ బ్యాక్ స్క్వాట్స్.. ఈ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్ సైజ్ వల్ల శరీరం చాలా శ్రమ పడుతుందట. ఇది కేలరీలు బర్నింగ్ రేటును పెంచుతుందట. అలాగే బాడీ ఫ్యాట్ శాతాన్ని తగ్గించడానికి కూడా బార్బెల్ బ్యాక్ స్క్వాట్స్ ఎంతో బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్.. ఇది కార్డియో కంటే ఎక్కువ కొవ్వును అలాగే కేలరీలను బర్న్ చేస్తుందట.

ఈత.. సులభంగా బరువు తగ్గాలి అనుకున్న వారికి ఇది చక్కటి ఎంపిక అని చెప్పాలి. ఈత కొట్టినప్పుడు శరీరంలోని ప్రతి కండరాన్ని, చేతులు, కాళ్లను బలోపేతం చేయడానికి పనిచేస్తుందట. ఇది కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుందట. పూల్ లేదా బావులలో ఈత కొట్టడాన్ని ఎంచుకోవచ్చని చెబుతున్నారు.

Exit mobile version