కాలం మారిపోవడంతో పాటు ప్రజల జీవన శైలి ఆహార ఆహారపు అలావాట్లు కూడా మారిపోయాయి. దీంతో చిన్న వయసు నుంచి జబ్బుల బారిన పడుతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలు కీళ్ల నొప్పులు సమస్య కూడా ఒకటి. యుక్త వయసు వారు కూడా ఈ కీళ్ల నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. వృద్ధులు మాత్రమే కాకుండా 20 ఏళ్ల పిల్లలనుంచి ఈ కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఉన్నారు. అయితే కీళ్ల నొప్పులను తట్టుకోవడానికి చాలామంది రకరకాల టాబ్లెట్స్, స్ప్రే, ఆయింట్మెంట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం లభిస్తుంది. అయితే ఇవి కాకుండా కొన్ని నేచురల్ డ్రింక్స్ ని తాగడం వల్ల కూడా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గ్రీన్ టీ ని సాధారణంగా బరువు తగ్గడానికే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ గ్రీన్ టీని తాగితే మీరు బరువు తగ్గడంతో పాటుగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చట. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు , పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయట. ఇవి శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, కీళ్ల వాపును తగ్గించడానికి బాగా సహాయపడతాయట.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో పాలు కూడా ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. పాలు కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ కు అద్భుతమైన మూలం అని చెప్పాలి. ఇది మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుందట. అందుకే మీరు పాలను తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయట. అలాగే ఎముకలు బలంగా కూడా మారుతాయని చెబుతున్నారు.
కాగా విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ మీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందట. ఈ ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు. ఇది జాయింట్ పెయిన్ ను తగ్గిస్తుందట. కాబట్టి మీ డైట్ లో విటమిన్ సి ఆహార పదార్థాలను చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు.