Monsoon Diseases: వర్షాకాలంలో ఆ వ్యాధులతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం?

వర్షాకాలం మొదలైంది.. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో కంటిన్యూగా తుఫాను పడుతూనే ఉంది. అయితే ఈ వర్షాల

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 09:00 PM IST

వర్షాకాలం మొదలైంది.. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో కంటిన్యూగా తుఫాను పడుతూనే ఉంది. అయితే ఈ వర్షాలు రావడంతో పాటు రోగాలను కూడా వెంటబెట్టుకొని వస్తాయి. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే వ్యాధులు రావడం సహజం. అయితే ఆ వ్యాధులు ఏమవుతాయిలే అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. వాతావరణం తేమగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌, దోమలు వృద్ధి చెందడానికి అనువైన కాలం. ఈ కాలంలో ఇమ్యూనిటీ కూడా కొంత బలహీనపడుతుంది. దీంతో అనారోగ్యాలు ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాయి.

వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలకు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, చర్మ సమస్యలు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులలో డెంగీ కూడా ఒకటి. ఈ డెంగీ కారణంగా ప్రతి ఏడాది వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. సాధారణంగా పగటిపూట, సాయంత్రం సమయంలో కుట్టే ఆడ ఏడిస్ దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అధిక జ్వరం, ఒళ్లు నొప్పు, అధిక చెమట, తలనొప్పి, కళ్ల నొప్పి, వికారం, వాంతులు, అలసట, దద్దుర్లు, లోబీపీ వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ తీవ్రంగా ఉన్నవారికి శ్వాస సరిగ్గా ఆడదు, ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా తగ్గుతుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం అయ్యి కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో మరో వ్యాధి మలేరియా. మలేరియా అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. కుట్టిన దోమలు ప్లాస్మోడియం పరాన్నజీవిని ఉంటే మలేరియా వస్తుంది. మలేరియా కారణంగా అధిక జ్వరం, కడుపు నొప్పి, గొంతు మంట, వాంతులు, డయేరియా, తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, గ్రంథుల వాపు, మలంలో రక్తం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అల్వ్ ఇన్‌ఫ్లుయెంజా.. అధిక తేమ, ఉష్ణోగ్రత మార్పులు.. ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తికి అనువుగా ఉంటుంది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, ముక్కు కారడం, అలసట, విరేచనాలు, ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని సకాలంలో చికిత్స తీసుకోకపోతే న్యుమోనియా, ఉబ్బసం, డయాబెటిస్‌, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక పరిస్థితులకు దారితీస్తుంది.​ అలాగే నిలిచిపోయిన నీటిలో పుట్టే దోమల వల్ల, చికున్‌గున్యా టైగర్ ఏడెస్ అల్బోపిక్టస్ ద్వారా ఇది వ్యాపిస్తుంది.

ఈ వైరస్‌ సోకిన దోమ మిమ్మల్ని కుట్టిన 3-7 రోజుల తర్వాత దీని లక్షణాలు మొదలవుతాయి. దీని వల్ల జ్వరం, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తాయి. మురికివాడల్లో, చెత్త నిండిన నివాస ప్రాంతాల్లో టైఫాయిడ్‌ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. సాల్మనెల్లా ఎంటెరికా సెరోవార్‌ టైఫి బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్‌ సంక్రమిస్తుంది. దీని బారినపడ్డవారిలో తీవ్రమైన జ్వరం, ఆకలి తగ్గడం, తలనొప్పి, హార్ట్‌బీట్‌ రేటు బాగా తగ్గడం, రక్తంలో తెల్లరక్తకణాల కౌంట్‌ తగ్గడం, డయేరియా, పొట్టనొప్పి, ఒళ్లంతా నొప్పులు, తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి.​ అయితే వర్షాకాలంలో ఈ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా చేయాల్సిన వాటిల్లో పరిశుభ్రత ఒకటి, రెండవది ఇంటిదగ్గర నీరు నిలవకుండా చూసుకోవడం. నిల్వ ఉన్న నీరు వల్ల అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయి.