Pregnant Women: గర్భిణీ స్త్రీలు (Pregnant Women) తమ ఆరోగ్యాన్నే కాదు, తమ బిడ్డల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ దశలో బిడ్డ అవయవాలు అభివృద్ధి చెందుతుంటాయి. కాబట్టి గర్భిణీ స్త్రీ తాను ఏం తింటుంది? తాగుతుంది? ఎలాంటి అలవాట్లు పాటిస్తుంది అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఈ విషయం గురించి వైద్య నిపుణులు సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనలు ఏంటో తెలుసుకుందాం!
గర్భిణీ స్త్రీలు అస్సలు చేయకూడని పనులు
ధూమపానం
వైద్యుల ప్రకారం.. గర్భిణీ స్త్రీ ధూమపానం చేయకూడదు. ధూమపానం వల్ల కార్బన్ డయాక్సైడ్ శరీరంలోకి వెళ్లి ఆక్సిజన్ మోసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల పుట్టబోయే బిడ్డ బరువు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
మద్యం
ధూమపానం లాగే, మద్యం సేవించడం కూడా బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యం బిడ్డ అభివృద్ధిని దెబ్బతీస్తుంది.
Also Read: TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
కాఫీ
కాఫీ గురించి వైద్యులు మాట్లాడుతూ.. దీనిని అధికంగా తీసుకోవడం మానుకోవాలి. రోజుకు 1 నుంచి 2 కప్పుల కాఫీ తీసుకోవచ్చు, కానీ కాఫీ వినియోగం 200 mg కంటే తక్కువ ఉండాలి.
మందులు
డాక్టర్ సలహా లేకుండా అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే అది బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఈ మందులు బిడ్డ మెదడు లేదా ఊపిరితిత్తులను దెబ్బతీయవచ్చు. అలాగే వీటి వల్ల తల్లి ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చు.
సౌందర్య సాధనాలు
గర్భిణీ స్త్రీలు సౌందర్య సాధనాలను వీలైనంత తక్కువగా వాడాలి. ఎందుకంటే ఈ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు బిడ్డ పెరుగుదల, అభివృద్ధిపై ప్రభావం చూపవచ్చు.