Bone Cancer: బోన్ క్యాన్సర్ లక్షణాలు ఇవీ..

క్యాన్సర్ వ్యాధి మోస్ట్ డేంజరస్. ఇది మన శరీరంలోని ఏ భాగానికైనా వచ్చే ముప్పు ఉంటుంది. ప్రధానంగా ఎముకలకు వచ్చే బోన్ క్యాన్స‌ర్ చాలా ప్రమాదకరమైనది.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 02:45 PM IST

Bone Cancer: క్యాన్సర్ వ్యాధి మోస్ట్ డేంజరస్. ఇది మన శరీరంలోని ఏ భాగానికైనా వచ్చే ముప్పు ఉంటుంది. ప్రధానంగా ఎముకలకు వచ్చే బోన్ క్యాన్స‌ర్ చాలా ప్రమాదకరమైనది. ఎముక‌ల్లోని కొన్ని కణాలు నియంత్రణ లేకుండా విపరీతంగా పెరిగినప్పుడు ఈ క్యాన్స‌ర్ వ‌స్తుంది. దీనివల్ల మన చేతులు, కాళ్ల‌ల్లోని పొడవాటి ఎముకలు నెగెటివ్ గా ప్రభావితం అవుతాయి. ఇతరత్రా క్యాన్సర్లు ఇప్పటికే నిర్ధారణ అయిన వాళ్లకు బోన్ క్యాన్సర్ ముప్పు అదనంగా ఉంటుంది.కొన్ని ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి బోన్ క్యాన్స‌ర్‌ను మనం గుర్తించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బోన్ క్యాన్సర్ లక్షణాలు..

◆ పెయిన్

బోన్ క్యాన్సర్ బారిన పడిన ఎముకలో నొప్పి, వాపు వస్తుంది. ఈ నొప్పి రోగికి మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తుంది. నొప్పి భ‌రించ‌లేక స‌రిగ్గా నిద్ర‌ప‌ట్ట‌దు.

 

◆ వెయిట్ లాస్

ఆకస్మికంగా బరువు తగ్గుతారు. ఉన్న‌ట్టుండి కిలోల కొద్దీ బ‌రువును కోల్పోతారు.

◆ అలసట..

మీరు అన్ని వేళలా అలసిపోతున్నారా? రోజువారీ పనులను సులభంగా చేయలేకపోతున్నారా? అయితే, త‌ప్ప‌కుండా పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. అలసట కూడా ఎముక క్యాన్సర్‌కు ఒక సంకేతం.

◆ లింపింగ్

కొంద‌రు ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా కుంటుతూ న‌డుస్తారు. ఇలాంటివారు వెంట‌నే బోన్ క్యాన్స‌ర్ టెస్ట్ చేయించుకోవాలి. బోన్ క్యాన్స‌ర్ ముఖ్య ల‌క్ష‌ణాల్లో లింపింగ్ (కుంటుతూ న‌డ‌వ‌డం) ఒక‌టి.

◆ రాత్రి చెమ‌ట‌లు

మీకు రాత్రి సమయంలో చెమటలు పడుతున్నాయా? చెమ‌ట‌ల‌తో శ‌రీరం మొత్తం త‌డిసిపోతున్న‌దా? అయితే ఇది బోన్ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల్లో ఒక‌ట‌ని వైద్యులు చెబుతున్నారు.

◆ కదల్లేని అసమర్థత..

మీరు కదల్లేక‌పోతున్నారా? ఉన్న‌చోటునుంచి నడవలేకపోతున్నారా? లేదా కూర్చోలేకపోతున్నారా? బోన్ క్యాన్స‌ర్ ఉన్న‌వారిలో ఈ ల‌క్ష‌ణం ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది.

◆ జ్వరం..

త‌రుచూ జ్వ‌రం అనేది బోన్ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల్లో ఒక‌టి. నెల‌లో రెండు లేదా మూడుసార్లు జ్వ‌రంబారిన ప‌డితే వెంట‌నే బోన్ క్యాన్స‌ర్ టెస్ట్ చేయించుకోవాలి.

◆ ఎముకపై గ‌డ్డ‌..

ఎముక క్యాన్సర్ లక్షణాలలో ఇది కూడా ఒకటి. దీనివల్ల ఎముక‌పై గ‌డ్డ ఏర్ప‌డుతుంది.

◆ ఎముక‌పై ప‌గుళ్లు..

ఎముక‌పై ప‌గుళ్లు క‌నిపిస్తే అది బోన్ క్యాన్స‌ర్‌కు సంకేతం. బ‌ల‌హీన‌మైన ఎముక బోన్ క్యాన్స‌ర్‌కు సంకేత‌మ‌ని వైద్యులు చెబుతున్నారు.

◆ కీళ్ల దృఢత్వం

మీ కీళ్లు దృఢంగా ఉన్నాయా? మీ రోజువారీ కార్యకలాపాలను సులభంగా చేయడం మీకు కష్టంగా అనిపిస్తుందా? అయితే, అది బోన్ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణ‌మేన‌ని వైద్యులు అంటున్నారు. ఇలాంటి ల‌క్ష‌ణం క‌నిపిస్తే వైద్యుడిని సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు.