Fenugreek: మెంతులు ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?

  • Written By:
  • Updated On - March 3, 2024 / 09:32 AM IST

మెంతుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మెంతులను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. అందుకే వీటిని ఆహారంలో బాగం చేసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే మెంతులు మంచిదే కదా అని ఎలా పడితే అలా ఎంత మోతాదులో అంటే అంత మోతాదులో తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. మరి మెంతులు ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెంతులను నీటిలో కలుపుకొని తాగడం వల్ల డయాబెటిక్‌ బాధితులకు మేలు జరుగుతుంది.

అయితే మంచిది కదా అని ఎక్కువగా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. మెంతులను మోతాదుకు మించి తీసుకుంటే చక్కెర స్థాయి గణనీయంగా తగ్గుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తు ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందట. మెంతిలో ఎక్కువగా సోడియం తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు తగ్గే అంకాశం ఉంటుంద. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు వీలైనంత వరకు మెంతులకు దూరంగా ఉండాలి. అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు మెంతి నీరు, మెంతులను తక్కువ తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

మెంతులు వేడి స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది.
గర్భిణీలు మెంతులకు దూరంగా ఉండాలట. మెంతులు వేడి స్వభావాన్ని కలిగి ఉన్న కారణంగా రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయట. పాలిచ్చే తల్లులు కూడా మెంతులకు దూరంగా ఉండాలని, ఇది కడుపు నొప్పికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మెంతులు తీసుకోవడం మంచిదే కానీ మోతాదుకు మించి అస్సలు తీసుకోకండి. అలా తీసుకుంటే సమస్యలు ఎదుర్కోక తప్పదు.