Site icon HashtagU Telugu

Salt Side effects: ఉప్పు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు?

Salt Side Effects

Salt Side Effects

మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు లేని వంట ఇల్లు అసలు ఉండదు. అలాగే ఉప్పులేని కూరలు కూడా ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రతి ఒక్క కూరలో ఉప్పును తప్పనిసరిగా వేస్తూ ఉంటారు.. ఉప్పు లేకపోతే ఆ కూర రుచి కూడా వేరే విధంగా ఉంటుంది. అయితే కొంతమంది కూరల్లో అలాగే ఇతర ఐటమ్స్ తినేటప్పుడు ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, కబాబ్,గోబీ మంచూరియా వంటివి తినేటప్పుడు ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఉప్పు తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువ తింటే మాత్రం ముప్పులు తప్పవు అంటున్నారు వైద్యులు.

మరి ఉప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉప్పు మన శరీరానికి అవసరమే. శరీరానికి అవసరమైన సోడియం మనకు ఉప్పు నుంచి లభిస్తుంది. సోడియం మన శరీరంలో ద్రవ పదార్థాలన్నీ సమతూకంలో ఉండేలా చూస్తుంది. కండరాలు,నాడలు సరిగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. ఉప్పులో సోడియం 40 శాతం క్లోరైడ్‌ 60 శాతం ఉంటాయి. శరీరానికి రోజుకు రెండు గ్రాముల సోడియం చాలు. అది అందాలంటే ఐదు గ్రాముల ఉప్పు సరిపోతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అది నిద్రలేమికి దారి తీస్తుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడానికీ ఉప్పు ఎక్కువగా తినడానికి సంబంధం ఉంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది, ఒంట్లోంచి నీరు సరిగా బయటకు వెళ్లకపోవటం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు.

మితిమీరి ఉప్పు తీసుకుంటే రాత్రి చాలాసార్లు మెలకువ రావడం, నిద్రలో చంచలమైన అనుభూతి వంటివి ఎదురవుతాయి. ఉప్పు ఎక్కువగా తింటే హైపర్‌టెన్షన్‌ పెరుగుతుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు రక్తంలో సోడియం స్థాయులను నియంత్రణలో ఉంచడానికి నీటి శాతం పెరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరిగి బీపీ ఎక్కువ అవుతుంది. దాంతో గుండెపోటు, స్ట్రోక్‌ రావడమే కీడ్నీ సమస్యలు ఎదురవుతాయి. ఉప్పు తెలివి తేటలను, జ్ఞాపకశక్తిని కూడా దెబ్బతీయగలదు. ఉప్పు ఎక్కువగా తింటే మెదడులో రక్త ప్రసరణ, నాడీకణాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఉప్పు ఎక్కువగా తినటం వల్ల వాసోప్రెసిన్‌ను విడుదల చేసే నాడీకణాలు అతిగా ప్రేరేపితమవుతాయి. దీంతో మెదడుకు రక్త ప్రసరణ తగ్గి, కణజాలం దెబ్బతింటుంది.