Site icon HashtagU Telugu

Urination Problems : మూత్ర విసర్జనలో నురగ, వాసన వస్తుందా ? ఇవే కారణాలు కావొచ్చు..

urination problems

urination problems

Urination Problems : మూత్రం ఎలాంటి రంగు, వాసన లేకుండా వస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. అలాకాకుండా మూత్ర విసర్జన సమయంలో మూత్రం రంగుగా రావడం, వాసన రావడం వవంటివి ఉంటే మీకు అనారోగ్య సమస్యలున్నాయని గుర్తించాలి. యూరిన్ కలర్ డార్క్ గా, చెడువాసన రావడం, నురగ రావడం వంటివి ఉంటే అనారోగ్యంతో ఉన్నారనే అర్థం.

సాధారణంగా మూత్ర విసర్జన చేసేటపుడు ఎక్కువ శక్తిని వాడితే.. నురుగ రావడం సహజం. డిటర్జెంట్లపై మూత్రం పోసినా అంతే. కానీ.. రొటీన్ గా మూత్ర విసర్జన చేసినా నురగ వస్తుంటే మాత్రం.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అయితే మూత్ర విసర్జనలో నురగ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి.

మూత్ర విసర్జనలో పెద్దమొత్తంలో ప్రొటీన్లు, రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి మీరు తరచూ నీరు తాగాలి. నీరు తక్కువగా తాగినా.. డీహైడ్రేషన్ కు గురై.. మూత్రంలో నురగలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మహిళలకు గర్భధారణ సమయంలో కిడ్నీలు ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి.. ఈ రకమైన మూత్రవిసర్జన సహజం. కాబట్టి కంగారు పడనక్కర్లేదు.

ఒత్తిడి కూడా ఒక సమస్య కావొచ్చు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నపుడు మూత్రంలో ప్రొటీన్ లీక్ అవుతుంది. ఆ సమయంలో మూత్రంలో నురుగు ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్నవారిలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది.

యూరిన్ లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటే.. ఆ పరిస్థితిని ప్రొటీనురియా అంటారు. కిడ్నీలు ప్రొటీన్లను సరిగ్గా ఫిల్టర్ చేయనపుడు ఈ సమస్య వస్తుంది. అలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. యూటీఐ బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించినపుడు నురగతో కూడిన మూత్రం వస్తుంది. ఇది హృదయ సంబంధిత సమస్యలకు సంకేతం. అలాగే మూత్రంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి.

మూత్రం ప్యూర్ వాటర్ లా కాకుండా రంగు మారితే.. అది అంతర్లీన వ్యాధులకు కారణం కావొచ్చు. కొన్ని యూరినరీ ఇన్ఫెక్షన్లు మూత్రాన్ని మిల్కీ వైట్ గా మార్చగలవు. మలబద్ధకం ఉన్న స్త్రీలలోనూ మూత్రం ఊదారంగులో కనిపిస్తుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది.

క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, కాలేయ సంబంధిత సమస్యలున్నపుడు మూత్రం రంగుమారుతుంది. ఎరుపు, బ్లూ, గ్రీన్, నారింజరంగు, ముదురు గోధుమ రంగు మొదలైనవి మూత్రానికి సంబంధించి అసాధారణమైన రంగులు. లేత పసుపు రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే అని అర్థం.

ముదురు పసుపు రంగులో వస్తుంటే మాత్రం అది డీ హైడ్రేషన్ కు సంకేతం. రోజుకు సుమారుగా 6-8 గ్లాసుల నీటిని తాగాలి. లేత నారింజరంగు మూత్రం.. ఇది వ్యక్తి నిర్జలీకరణానికి గురయ్యాడనేందుకు సంకేతం. వైద్యుడిని సంప్రదించి.. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి.