Site icon HashtagU Telugu

Fridge: ఫ్రిడ్జ్‌లో ఎక్కువసేపు పాలు నిల్వ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

Whatsapp Image 2023 05 28 At 19.20.09

Whatsapp Image 2023 05 28 At 19.20.09

Fridge: కూరగాయలు, పాల పదార్థాలు చెడిపోకుండా ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటాం. రోజూ ఉపయోగించే పాలను ఫ్రిడ్జ్‌లో గంటల కొద్ది స్టోర్ చేస్తాం. అయితే పాలు అనేవి త్వరగా చెడిపోతూ ఉంటాయి. ఏ రోజు పాలు ఆ రోజు ఉపయోగించాలి. అప్పుడు ఆరోగ్యానికి మేలు చేస్తోంది. ఫ్రిడ్జ్ లో ఉంచితే పాలు చెడిపోవని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని గంటలు పాటు అయితే బాగానే ఉంటాయి. చాలామంది ఒకరోజు పాటు అలాగే ఉంచి వాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు పాలు చెడిపోయే అవకాశముంటుంది.

ఫ్రిడ్జ్‌లు పాలు నిల్వ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పాలు పెట్టుకోవడానికి ఫ్రీజర్ కింద ప్రత్యేక స్థలం ఉంటుంది. అయినా చాలామంది అక్కడ పెట్టరు. ఫ్రిడ్జ్‌లో ఖాళీగా లేదిని ఎక్కడబడితే అక్కడ పెడుతూ ఉంటాం. కానీ అలా ఎక్కడబడితే అక్కడ పెట్టడం వల్ల చెడిపోయే ప్రమాదం ఉంటుంది. పాలు ఎప్పుడూ ఒకే ఉష్ణోగ్రతలో ఉంచాలి. లేకపోతే చెడిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ తెరిచిన ప్రతిసారి పాల చుట్టూ ఉన్న చల్లటిగాలి బయటకు పోతూ ఉంటుంది.

బయటకు పోవడం వల్ల పాలు చెడిపోయే అవకాశముంటుంది. అందుకే పాల కోస కేటాయించిన స్థలంలోనే స్టోర్ చేసుకోవాలి. ఇక పాలను ఒకరోజు కంటే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో ఉంచినా పాడైపోతాయి. వాసన లాంటివి వస్తాయి. అందుకే పాలను ఎప్పటికప్పుు తాజావి వాడుకోవాలి. అప్పుడు ఆరోగ్యానికి మంచి జరుగుతోంది. గంటలకొద్ది స్టోర్ చేయడం వల్ల పాలల్లో లభించే గుణాలు కూడా నాశనమైపోతాయి. దీంతో అలాంటి పాలను తాగడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు.