Site icon HashtagU Telugu

Health Care: దోమల బెడదకు చెక్ పెట్టండి ఇలా.. జాగ్రత్త చర్యలు ఇవే

Mosquitoes

Mosquitoes

Health Care: దోమల బెడద వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం, ఇతర కారణాల వల్ల దోమలు వ్యాప్తి చెందుతుంటాయి. అయితే ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటే దోమల బారి నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇండ్ల ఆవరణలో, చుట్టుప్రక్కల ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూడాలి. వారంలో రెండు రోజులు డ్రై డే పాటించి నీటి నిల్వలు అన్నింటిని శుభ్రపరచి ఆరబెట్టి తిరిగి నింపుకోవాలి. నిలువ వున్న మురుగు నీటి గుంతల్లో కిరోసిన్ లేదా వాడిన ఆయిల్ గాని చల్లడం ద్వారా లార్వా దశలో ఉన్న క్రిమికీటకాలను నివారించవచ్చు.

ఓవర్హెడ్ ట్యాంకులపై మూతలు పెట్టాలి. పనికిరాని వస్తువులు వాడిన టైర్లు, కోబ్బరి బోండాలు, రోల్లు, కూలర్లు, సీసాలు మొదలగు వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమలు కుట్టకుండా కిటికీలకు, బయట తలుపులకు దోమలు రాకుండా మెష్ ఏర్పాటు చేసుకోవాలి, వ్యక్తిగత రక్షణకు, కాయిల్స్ వాడాలి. శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే వస్త్రాలను వాడాలి. ఇంటి బయటగాని, లోపల నిద్రించునప్పుడు తప్పని సరిగా దోమతెరలు వాడాలి.

దోమల నివారణ ప్రతి ఒక్కరి బాద్యత అని, ప్రతి కుటుంబం వారి వారి పరిధిలో దోమల నివారణ చర్యలు చేపట్టాలి. ఇంటి లోపల, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాలలో గాని దోమలు తయారు కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం వలన దోమల అభివృద్ధిని పూర్తిగా నివారించవచ్చు.