Site icon HashtagU Telugu

Health Tips: రాత్రిపూట ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Mixcollage 16 Jun 2024 02 00 Pm 3599

Mixcollage 16 Jun 2024 02 00 Pm 3599

కాలం మారిపోవడంతో కాలానికి అనుగుణంగా మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి అన్నీ మారిపోయాయి. దానికి తోడు అనారోగ్య సమస్యల బాధపడే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. సమయానికి సరిగా భోజనం చేయక నిద్రపోక ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో అయితే చాలామంది అర్ధరాత్రి ఒంటిగంట రెండు గంటల సమయం వరకు మేలుకొని ఆ సమయంలో నిద్ర పోతున్నారు. ఇలా లేట్ నైట్ నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే లేట్ నైట్ భోజనం చేసేవారు కూడా ఉన్నారు.

మరి ఈ విధంగా రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే చాలా మందికి రాత్రి ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారనే భావన ఉంటుంది. అయితే బరువు పెరగడానికి, ఏ సమయంలో ఆహారం తీసుకుంటామన్న దానికి సంబంధం లేకపోయినాప్పటికీ. రోజు మొత్తం మీద తీసుకొనే క్యాలరీల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా నిద్ర పోవడానికి ముందు ఎక్కువగా తింటే కలత నిద్ర, అజీర్తి లాంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి రాత్రి పడుకునే ముందు కనీసం రెండు గంటల ముందు భోజనం చేయడం మంచిది.

అలాగే మూడు పూటలూ కడుపు నిండా తినడం కంటే, చిన్నచిన్న గ్యాప్‌ ఇచ్చి కొద్ది కొద్దిగా తినడం మంచిదనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పోషకాలు పుష్కలంగా ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యకరం. అదేవిదంగా డీటాక్స్‌ డైట్‌ తీసుకోవడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయని చెబుతుంటారు. శరీరం నుంచి విష పదార్థాలను సహజసిద్ధంగా తొలగించడంలో కాలేయం, మూత్రపిండాలు, జీర్ణ వ్యవస్థ, చర్మం, ఊపిరితిత్తులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే డీటాక్స్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల ప్రత్యక్షంగా పెద్ద ప్రభావం లేకపోయినా..ఇటువంటి పరోక్ష ప్రభావాలకు డీటాక్స్‌ డైట్స్‌ దోహదం చేస్తాయి.అలాగే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసు నీరు తాగాలని చెబుతుంటారు. అయితే కేవలం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఎంత నీరు తాగాలనేది వాతావరణం, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, చెమట ఎంత ఎక్కువగా పడుతోంది లాంటి అంశాల ఆధారంగా నీరు తీసుకోవాల్సి ఉంటుంది.