Site icon HashtagU Telugu

Diwali: దీపావళి పండుగ రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా?

Diwali

Diwali

దీపావళి పండుగ వచ్చింది అంటే చాలు పెద్దవారు కూడా చిన్న పిల్లల మారిపోతూ ఉంటారు. ఇంటిని చక్కగా దీపాలతో అలంకరించడంతో పాటు టపాసులను పేలుస్తూ చాలా ఆనందంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది అనగా 2024 లో అక్టోబర్ 31వ తేదీన ఈ దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇక ఈ దీపావళి పండుగ రోజు చాలామందికి తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అలాగే ఎలాంటి పనులు చేయాలి అన్న విషయాలు కూడా చాలా మందికి తెలియదు. మరి దీపావళి పండుగ రోజు ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టపాసులు పేల్చేటప్పుడు, దీపాలు వెలిగించేటప్పుడు మీరు సింథటిక్ దుస్తులను వేసుకోకూడదు. వీటికి బదులుగా కాటన్ దుస్తులను మాత్రమే వేసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఏ సమయంలోనైనా అవసరం రావచ్చు, కాబట్టి బకెట్ లో నీటిని మీకు అందుబాటులో ఉంచుకోవడం మంచిది. మీ చెవులు టపాసుల సౌండ్స్ కు దెబ్బతినకుండా చెవుల్లో కాటన్ ప్లగ్లను ఎందుకంటే క్రాకర్స్ శబ్దం మీ చెవులను దెబ్బతీస్తుంది. టపాసులను కాల్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా పారవేయాలి. పేలని టపాసులు ఉంటే ఎందుకు పేలడం లేదని పరిశీలించడానికి ట్రై చేయకండి. చాలామంది చేతుల్లో టపాసులను పేలుస్తూ పిచ్చిపిచ్చి విన్యాసాలు చేస్తూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా అస్సలు చేయకండి.

ఇలా చేయడం వల్ల కొన్ని కొన్ని సార్లు అవి చేతిలోనే చేయడానికి అలాగే మనుషులకు గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టపాసులను పేల్చిన తర్వాత తప్పనిసరిగా చేతులను ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. చిన్నపాటి కాలిన గాయం అయినా మంట తగ్గే వరకు కాలిన గాయాలను చల్ల నీటితో కడగడం మంచిది. ఒకవేళ అగ్నిప్రమాదం జరిగినట్టైతే వెంటనే అగ్నిమాపక దళానికి కాల్ చేయాలి. అలాగే టపాసులను పేల్చేముందు క్రాకర్ లేబుల్ పై ముద్రించిన సూచనలను ఖచ్చితంగా చదవాలి. ముఖ్యంగా కొత్తగా క్రాకర్స్ ను కాల్చుతున్నవారు. చాలా మంది తమ సరాదా కోసం జంతువుల దగ్గర క్రాకర్స్ ను పేలుస్తుంటారు. కానీ ఇలాంటి విన్యాసాలు అసలు చేయకూడదు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ లో టపాసులను పేల్చకూడదు. మీ చుట్టుపక్కల మండే పదార్థాలు ఉన్నప్పుడు టపాసులను పేల్చకూడదు.
క్రాక్ర్స్ ను కంటైనర్ లో వేసి మూయకూడదు. టపాసులను కాల్చేటప్పుడు సురక్షితమైన దూరాన్ని పాటించాలి.టపాకాయలు కాల్చేటప్పుడు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో హెయిర్ లీవ్ చేయకూడదు. పొడవాటి జుట్టున్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు టపాసులు పేల్చేటప్పుడు తల్లిదండ్రులు పక్కనే ఉండాలి. మరి ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు చెప్పులు ధరించడం తప్పనిసరి.