Site icon HashtagU Telugu

Coconut Water: కొబ్బరి నీళ్లు మంచివే అని తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 15 Jan 2024 04 35 Pm 6949

Mixcollage 15 Jan 2024 04 35 Pm 6949

కొబ్బరి నీరు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు హెల్త్ బాగో లేనప్పుడు నీరసంగా ఉంది అన్నప్పుడు వెంటనే కొబ్బరి నీళ్లు తాగమని సూచిస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా వీటిని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరానిక ఎంతో మేలు చేస్తాయి.

ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. అయితే కొబ్బరినీరు ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. మోతాదుకు మించి తాగితే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటున్నారు వైద్యులు. మరి కొబ్బరి నీరు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నీరు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీటిని మితంగా తీసుకోవాలి.

ఇక కొందరికి కొబ్బరి నీటిని తాగడం వల్ల అలర్జీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొందరిలో కొబ్బరి నీరు దద్దుర్లు, దురద, వాపులకు దారితీస్తుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో కొబ్బరి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కొబ్బరి నీటిని మోతాదుకు మించి తీసుకోకూడదు. కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు వైద్యుల సూచన మేరకే కొబ్బరి నీరును తీసుకోవాలి. ఇక ఇటీవల కొబ్బరి నీరు ప్యాక్‌ చేసిన బాటిల్స్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో సహజంగానే ఎక్కువగా షుగర్‌ ఉంటుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.