Site icon HashtagU Telugu

Blood Pressure: రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఏం తినాలో తెలుసా?

Blood Pressure

Blood Pressure

ఇదివరకటి రోజుల్లో కేవలం వయసు మీద పడిన వారికీ మాత్రమే షుగర్, బీపీ వంటి సమస్యలు వచ్చేవి. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ రెండు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య బారిన ఎక్కువ మంది పడుతున్నారు. అయితే ఇందుకు గల కారణం తీసుకునే ఆహార పదార్థాలు అని చెప్పాలి. ఈ రక్తపోటు సమస్యను సకాలంలో గుర్తించకపోవడం వల్ల,చికిత్స తీసుకోకపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందట. అయితే రక్తపోటును నియంత్రించడానికి మీ రోజువారి ఆహారంలో మార్పులు చాలా అవసరం అని చెబుతున్నారు. అయితే మరి అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అరటిపండ్లు పోషకాలకు మంచి వనరులు అన్న విషయం తెలిసిందే. తక్కువ ధరకే ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల తక్షణ ఎనర్జీ వస్తుందట. పొటాషియం ఎక్కువగా ఉండే ఈ అరటిపండ్లను తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుందని, అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన వాటిలో బచ్చలి కూర కూడా ఒకటి. ఇందులో పొటాషియం, నైట్రేట్లు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బచ్చలికూరను తరచుగా డైట్ లో చేర్చుకోవడం వల్ల అదిక రక్త పోటు సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. బీట్రూట్ కూడా బీపీ పేషంట్లకు ఎంతో బాగా పనిచేస్తుందట. ఇందులో ఉండే నైట్రేట్స్ రక్తనాళాలను సడలించడానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయట.

అందుకే బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఇలా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటున నివారించవచ్చని చెబుతున్నారు. వాల్ నట్స్ మంచి పోషకాహారం. ఇందులో జింక్, కాల్షియం, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయట. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుందట. అలాగే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుందని, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా దానిమ్మ పండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయట. వీటిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, దానిమ్మ పండ్లు కూడా అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.