Meat: నెలరోజులపాటు మాంసాహారం తినడం మానేస్తే ఏమవుతుందో తెలుసా?

భారతదేశంలో హిందువులు చాలా సందర్భాలలో మాంసాహారాన్ని తినడం మానేస్తూ ఉంటారు. కార్తీకమాసం శ్రావణమాసం ఆషాడమాసం అంటూ ఇలా నెలల ప్రకారం

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 09:40 PM IST

భారతదేశంలో హిందువులు చాలా సందర్భాలలో మాంసాహారాన్ని తినడం మానేస్తూ ఉంటారు. కార్తీకమాసం శ్రావణమాసం ఆషాడమాసం అంటూ ఇలా నెలల ప్రకారం మాంసాహారం తినకుండా ఉంటారు. అంతేకాకుండా పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత పెళ్లి అయిపోయే వరకు కూడా వధువు వరులు వారి తల్లిదండ్రులు కూడా మాంసాహారాన్ని ముట్టుకోకూడదని చెబుతూ ఉంటారు. ఇలా కొంతమంది చాలా రోజులపాటు అసలు మాంసాహారమే తినకుండా ఉంటారు. అయితే ఒకవేళ నెలరోజుల పాటు మాంసాహారం తినకుండా ఉంటే శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎంతోమంది మాంసాహారాన్ని విడిచి శాఖాహారం వైపుగా ఆసక్తి చూపిస్తున్నారు. శాఖాహారంలో మొక్కల ఆధారిత ఆహారాలు అధికం. ఇవి పోషక అవసరాలను కూడా తీరుస్తాయి. మొక్కల ఆధారిత ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగు కదలికలను నియంత్రించి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను అందిస్తుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. మొక్కల ఆధారిత ఆహారానికి మారడం మరో ముఖ్య కారణం బరువు పెరగకుండా ఉండడం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు మాంసాహారాన్ని మానేయాలి. పూర్తిగా శాకాహారం పైనే ఆధారపడాలి. జంతు ఉత్పత్తులతో పోలిస్తే శాఖాహార ఉత్పత్తుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి.

ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి త్వరగా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. జంతు ఆధారిత ఆహారాలు అందులోనూ ప్రాసెస్ చేసిన మాంసాలు శరీరంలో ఇన్ఫర్మేషన్ ను పెంచుతాయి. కాబట్టి మాంసాహారాన్ని వినియోగించడం తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి ఇవి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. జంతువు ఆధారిత ఆహారాలలో సంతృప్త ట్రాన్స్ఫార్ట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాలను పేరుకుపోయేలా చేస్తాయి. కాబట్టి నెల రోజులు పాటు మాంసాహారాన్ని తినకుండా పూర్తి శాకాహారాన్ని తిని చూడండి మీ శరీరంలో వచ్చే ఎన్నో మార్పులు మీకు స్పష్టంగా తెలుస్తాయి. మానసిక ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి.

మీరు కోపం తక్కువగా తెచ్చుకుంటారు ప్రశాంతంగా ఉంటారు. శాఖాహారం శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సెల్యులర్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. అంటే కణాలు నష్టపోకుండా కాపాడుతుంది. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు కూడా ఆరోగ్యంగా ఉండి ప్రశాంతమైన మనసుని ఇస్తుంది. పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే అందుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదమూ తగ్గుతుంది. ఇవి రోజంతా శక్తి స్థాయిలను అందించడానికి సహాయపడతాయి. అన్ని రకాల మాంసాహారాలు ఒకే స్థాయిలో ప్రమాదాన్ని కలిగించవు. చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే. వీటిని తినడం వల్ల మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. అయితే ప్రాసెస్ చేసిన మాంసాలను మాత్రం తినకూడదు. .