ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాడితో పాటు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ తీసుకుంటే చాలు వారం రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గడం ఖాయం అంటున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏవో అవి ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువు తగ్గడానికి సూపర్ వెయిట్ లాస్ డ్రింక్స్ కూరగాయల జ్యూస్ కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్ ను తీసుకోవడం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది. దీంతో పరోక్షంగా అనవసర ఆహారం శరీరంలోకి వెళ్లకుండా డైట్ మెయింటేన్ అవుతుంది. కాబట్టి ప్రతీ రోజు ఒక గ్లాస్ కూరగాయల జ్యూస్ ను తాగాలి.
బరువు తగ్గడానికి జీలకర్ర రసం కూడా ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కొలస్ట్రాల్ లెవెల్స్ వల్ల ఇది శరీరంలో వేడిని పెంచి బరువును తగ్గిస్తుంది. అలాగే కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ కూడా ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. గ్రీన్ టీలో కెటెచిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండడం వల్ల కొవ్వు సులభంగా కరుగుతుంది. రోజుకు ఒక కప్ గ్రీన్ టీ మీ బరువును తగ్గడంలో దోహదపడుతుంది. అలాగే బ్లాక్ టీ కూడా ఎందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బ్లాక్ టీ లేదా డికాషన్ లో క్యాలరీలను బర్న చేసే కెఫిన్ ఉంటుంది. శరీరంలో కొవ్వును కరిగించి పాలిఫెనాల్స్ బ్లాక్ టీ లో ఉండడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
యాపిల్ సైడర్ వెనిగర్ లో ఈ అసిటిక్ యాసిడ్ పుష్కలంగా ఉండడంతో బరువు సులభంగా తగ్గుతారు. ఇన్సులిన్ స్థాయిని కూడా ఇది తగ్గిస్తుంది. ప్రొటీన్ డ్రింక్స్ ఉదయాన్నే ప్రొటీన్ డ్రింక్స్ తాగడం వల్ల కడుపు నిండుగా అనిపించి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీంతో కడుపులో అనవసరం చెత్త వెళ్లకుండా బరువు నియంత్రణను పరోక్షంగా చేపడుతుంది. నీళ్లు తాగడం వల్ల ఏ శ్రమ లేకుండా శరీరంలో 20 నుంచి 30 శాతం క్యాలరీలు బర్న్ అవుతాయట. కాబట్టి తరచుగా శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు..