Site icon HashtagU Telugu

Neem: వేపాకు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

Mixcollage 01 Dec 2023 07 16 Pm 4497

Mixcollage 01 Dec 2023 07 16 Pm 4497

వేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటినుంచో ఈ వేపాకును ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో వినియోగిస్తూనే ఉన్నారు. వేప ఆకుల నుంచి పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు, బెరడు ఇలా ప్రతి ఒక్కటి వ్యాధుల చికిత్స కోసం, శరీర సౌందర్యానికి ఉపయోగిస్తారు. రోజూ తాజా వేప ఆకులను నమిలి తినడం వల్ల శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ఇనుము, కాల్షియం ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. వేప ఆకులను పరగడుపున తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వేప రసం తాగితే ఇన్‌ఫెక్షన్ల నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మధుమేహం ఉన్నవారు నిత్యం వేపాకులను తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఈ వేపాకుల్లో ఉండే పదార్థాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోజు వేపాకులను తింటే షుగర్ రాకుండా ఉంటుంది. అలాగే నోట్లో ఉండే సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయి. కాన్సర్ ఉన్నవారికి కూడా వేపాకు ఉపయోగపడుతుంది. ఈ వేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను ఎదగకుండా కంట్రోల్ ఉంచుతాయి. అలాగే ఈ ఆకు శరీరంలోని మృతు కణాలను కూడా తొలగించగలదు. ఈ వేపాకులు మంచి ఔషధం.

ఈ ఆకులు మొటిమల మీద రాస్తే ఈ సమస్య తగ్గిపోతుంది. అలాగే ఈ ఆకుల రసాన్ని తలకి అప్లై చేసుకుంటే చుండ్రు సమస్య నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ వేపాకుల రసాన్ని శరీరంపై ఉండే దద్దుర్లు ఎలర్జీ దురదలు తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తలలో పేలు ఉన్నవారు వేప పేస్ట్ ని అప్లై చేయడం వలన వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. వేప ఆకులు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. కాబట్టి పరగడుపున వేప ఆకులు తినడం వల్ల హానికారిక బ్యాక్టీరియాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వేప ఆకులు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు పోరాడుతాయి.