Ginger Juice: పరగడుపున అల్లం రసం తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

  • Written By:
  • Updated On - February 24, 2024 / 10:14 PM IST

అల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ అల్లం తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలా అని అల్లం ఎక్కువ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. పరగడుపున అల్లం రసం తీసుకోవడం చాలా మందికి అలవాటు. మరి ఉదయాన్నే పరగడుపున అల్లం రసం తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే కీళ్ల నొప్పులు వాపులు తగ్గుతాయి. శరీరానికి కావాల్సిన జింక్ మెగ్నీషియం పొటాషియంలు సమృద్ధిగా ఈ అల్లం రసంలో ఉంటాయి. ఇవి నొప్పులు తగ్గిస్తాయి.

శరీరంలో ఎక్కువగా నీరు చేరుతుంటే పరిష్కారం చూపుతుంది. అల్లం రసం తాగితే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్లు ఉన్నవారు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అల్లం రసం తాగితే మంచి ఫలితం కనిపిస్తోంది. అలాంటి వారు అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ వృద్ధాప్య ఛాయాలను దరిచేయవు. దీంతో ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. చర్మం వెంట్రుకలు గోళ్ళు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు వయసు మీద పడడం వల్ల ఉంటాయి. అల్లం రసం ప్రయాణ సమయంలో తాగితే ప్రయాణంలో ఉండే వికారం వాంతులు రాకుండా ఉంటాయి. అంతేకాదు గర్భిణీ స్త్రీలలో వికారం వాంతులు అధికంగా ఉంటాయి.

అలాంటప్పుడు అల్లం తినటం ద్వారా వాంతులు వికారం తగ్గుతాయి. అజీర్తి తగ్గుతుంది. గుండెలో మంట అనిపించినప్పుడు అల్లం టీ తాగితే తగ్గుతుంది. అల్లంతో సహజ పద్ధతిని ఇలా పాటిస్తే మొటిమలు పోతాయి. అల్లం రసంలో దూదిని ఉంచి మొటిమలపై రాస్తుంటే మొటమలు తగ్గుతాయి. చర్మం మంటగా అనిపించిన చోట అల్లం రసం రాస్తే మంట పోతుంది. పాదాలపై బ్యాక్టీరియా దుమ్ముపోయి పాదాలు ఆరోగ్యంగా చూడటానికి అందంగా ఉండాలంటే బకెట్లో లైట్ హీట్ వాటర్ లో అల్లం రసం కలిపి పాదాలు అందులోంచి అరగంట రిలాక్స్ అయితే చాలు మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.

అల్లం రసంలో నిమ్మరసం తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖంపై అప్లై చేసి పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగితే స్కిన్ టోన్ బాగుంటుంది. చర్మం అందంగా కాంతివంతంగా ఉండటమే కాక ముఖంపై అనేక కారణాల్లో వచ్చిన మచ్చలు పోతాయి. అల్లం పేస్ట్ నుదుటిపై నొసలపై అప్లై చేసి రిలాక్స్ అయితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న అల్లాన్ని మనం తరచూ ఉపయోగించి దానిలోని పోషక విలువలు పొంది ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం గడపాలి.