Diabetes control : డయాబెటిస్ బాధితులకు వరం…ఈ టీలతో షుగర్ లెవల్స్ అదుపులో..!!

మధుమేహం...జీవక్రియకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య వల్ల రక్తంలో షుగర్ స్థాయి వేగంగా పెరుగుతుంది.

  • Written By:
  • Publish Date - August 21, 2022 / 09:00 AM IST

మధుమేహం…జీవక్రియకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య వల్ల రక్తంలో షుగర్ స్థాయి వేగంగా పెరుగుతుంది. నాసిరకం జీవనశైలి, ఆహారపు అలవాట్లు…వీటి కారణంగా ఈ వ్యాధి చిన్నవయస్సులోనే పట్టిపీడిస్తోంది. శరీరానికి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది చాలా ముఖ్యం. ఇన్సులిన్ రక్తం నుంచి కణాలకు గ్లూకోజ్ ను రవాణా చేస్తుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. శరీరంలో సరైన మొత్తంలో ఇన్సులిన్ తయారుకానప్పుడు…బాధితుడి శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది.

కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ప్రభావవంతమైన మూలికల ద్వారా షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఉదయం నడవడం, వ్యాయామం చేయడం, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల షుగర్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దీనికి తోడు కాస్త టీ తాగడం అలవాటు చేసుకుంటే వ్యాధి నియంత్రణ సులువవుతుంది. షుగర్ ను నియంత్రణలో ఉంచే టీల గురించి తెలుసుకుందాం.

గ్రీన్ టీ:
ఇది బరువు తగ్గించడానికి, రక్తపోటును నిర్వహించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సెల్ డ్యామేజ్‌ను నివారించిడంతోపాటు మధుమేహాన్నినియంత్రించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

మందార టీ:
ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా ఆర్గానిక్ యాసిడ్స్, బ్లడ్ షుగర్ కంట్రోల్ గుణాలు ఇందులో ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయి.

బ్లాక్ టీ:
ఇది చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉన్న పానీయం. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. రోజూ మూడు కప్పుల బ్లాక్ టీ తాగే వారికి మధుమేహం దరిచేరదు.

దాల్చిన చెక్క టీ:
ఇది ప్రతి ఇంట్లో కనిపించే సాంప్రదాయక మసాలా. దాని అపారమైన ఔషధ గుణాలతో, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం లేదా టీలో వేసుకుని తాగడం ద్వారా మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. ప్రధానంగా దాల్చినచెక్క రక్తంలో చక్కెరను అధికంగా విడుదల చేయడాన్ని నిరోధిస్తుంది.అంతేకాదు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

చమోమిలే టీ:
ఇది ఒక మూలిక. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ టీలో అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.