Pain Killers: మన వంటింట్లోనే ఉండే 11 పెయిన్ కిల్లర్స్ ఇవే..!

వెన్నునొప్పి, మడమ నొప్పి, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి, పంటి నొప్పి ఇలా చెప్పుకుంటూ పోతే

వెన్నునొప్పి, మడమ నొప్పి, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి, పంటి నొప్పి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల నొప్పుల (Pains)తో నిత్యం ఎంతోమంది బాధపడుతుంటారు. ఈ నొప్పుల నుంచి ఫాస్ట్ రిలీఫ్ కోసం చాలామంది తొందరపడి పెయిన్ కిల్లర్స్‌ (Pain Killers) వాడుతుంటారు. అయితే పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటికి బదులు మన ఇంటి వంటగదిలోనే ఉండే కొన్ని నేచురల్ పెయిన్ కిల్లర్స్ (Pain Killers) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లవంగాలు

మీకు పంటినొప్పి సమస్య ఉంటే లవంగాలు చాలా బాగా పనిచే స్తాయి. వీటిలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫమేటరీ, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్‌ ప్రాపర్టీస్‌ ఉంటాయి.

అల్లం

అల్లం మనకు బాడీ పెయిన్స్‌ నుంచి ఉపశమనం కల్పిస్తుంది.2 గ్రాముల అల్లంను ప్రతిరోజు తినడం వల్ల కండరాల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. ఇది ఎక్సర్‌సైజ్‌ లేదా రన్నింగ్‌ వల్ల కలిగే నొప్పుల నుంచి కూడా రిలీఫ్ కల్పిస్తుంది.

ల్యావెండర్‌ ఆయిల్‌

ల్యావెండర్‌ ఆయిల్‌తో నిద్రలేమి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. యాంగ్జైటీ నుంచి ఇది విముక్తి కల్పిస్తుంది. ఈ ఆయిల్‌తో ఆవిరి పట్టుకోవడం వల్ల మైగ్రేయిన్‌కు సంబంధించిన తలనొప్పుల నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది.

పెప్పరమింట్‌ ఆయిల్‌

పెప్పరమింట్‌ ఆయిల్‌లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, పెయిన్‌ రిలీవింగ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఇది కాపాడగలదు. నొప్పి ఉన్న ప్రాంతంలో ఈ ఆయిల్‌తో మసాజ్‌ చేసుకోవాలి.

క్యాప్సైసిన్‌

క్యాప్సైసిన్‌ అనే పదార్థం ఎర్ర మిరపకాయల్లో ఉంటుంది. ఇది కూడా నేచురల్‌ పెయిన్‌ రిలీఫ్‌ను ఇస్తుంది. ఇది స్కిన్‌పై పెయిన్‌ సెన్సిటివిటీని తగ్గిస్తుంది.

పసుపు

పసుపులో యాంటీసెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఫంగల్‌ వంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పాలలో పసుపు కలిపి తీసుకుంటే గాయాలు నయమవుతాయి. నోటిలో పుండ్లతో బాధపడుతున్న వారికి కూడా పసుపు దివ్యౌషధంగా పనిచేస్తుంది. నీరు, కొబ్బరి నూనెతో పసుపుని పేస్ట్‌గా చేసి నోట్లో పుండ్లు అయిన చోట రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పసుపుని రాస్తే గాయం వెంటనే మానిపోతుంది. జలుబు చేసి ముక్కుదిబ్బడతో బాధపడుతున్న వారిపై కూడా పసుపు చక్కగా పనిచేస్తుంది.

పెరుగు

పాశ్చరైజ్ చేయని, రుచిలేని పెరుగు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఉబ్బరం వల్ల వచ్చిన వాపు, నొప్పి లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ పెరుగులో జీర్ణక్రియ ప్రక్రియకు సహాయపడే హెల్దీ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రతిరోజు రెండు గ్లాసుల పెరుగు తీసుకోవడం ద్వారా కడుపు నొప్పిని వదిలించుకోవచ్చు. నెలసరి వల్ల వచ్చే తిమ్మిరి, నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచి, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను 10 నుంచి 15% వరకు తగ్గిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. తాజా వెల్లుల్లిని కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీబయాటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. వెల్లుల్లి తరచూ తినడం ద్వారా డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులను రాకుండా చూసుకోవచ్చు.

సోయా

సోయా బీన్స్ లో ‘isoflavones’ అనే పదార్థం ఉంటుంది. దీనికి బలమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ పెయిన్స్ ను ఇది తగ్గిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ బాధితుల్లో ఆ వ్యాధి లక్షణాలు తగ్గేందుకు సోయా బీన్స్ ఫుడ్ హెల్ప్ చేస్తుంది.

ధనియాలు

ధనియాలు కొత్తిమీర మొక్కలకే కాస్తాయని మనలో చాలామందికి తెలియదు. ధనియాలను నలిపి మట్టిలో వేస్తే కొత్తిమీర మొక్క మొలుస్తుంది. ధనియాలలో urandrol అనే ఆయిల్ దాగి ఉంటుంది. ధనియాలు తింటే అజీర్తి సమస్యలు తగ్గేలా urandrol చేస్తుంది. మన లివర్ లో ఏవైనా హానికారక, అనవసర పదార్థాలు ఉంటే వాటిని బయటికి పంపడంలోనూ ధనియాలలోని urandrol హెల్ప్ చేస్తుంది. ధనియాలు, బెల్లం కలిపి తినడం వల్ల కండరాల నొప్పులు, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

వాము లేదా ఓమ

నల్ల ఉప్పు , గోరు వెచ్చటి నీటిలో ఓమను కలిపి తింటే అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్ విడుదలయ్యేలా చేసి.. జీర్ణ వ్యవస్థ పనితీరును గాడిన పెట్టే సామర్ధ్యం ఓమకు ఉంది. కీళ్ల నొప్పులు, చెవి నొప్పి, వాతపు నొప్పులు, కడుపు నొప్పి నుంచి కూడా ఓమ ఎంతో ఉపశమనం కల్పిస్తుంది.

Also Read:  Buying New Phone: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? తొందరపడితే నష్టపోవాలసిందే..