వేసవికాలం ఇంకా మొదలు కాకముందే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. అయితే వేసవికాలం వచ్చింది అంటే చాలు ఎదురయ్యే సమస్య డీహైడ్రేట్. కాగా శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉండాలి అంటే అందుకు తగినట్టుగా ఆహారం పళ్ళు,నీళ్లు తీసుకోవాలని చెబుతున్నారు. కాగా వేసవి కాలంలో తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. మరి వేసవిలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండాకాలంలో తీసుకోవాల్సిన వాటిలో పుదీనా ఒకటి.
పుదీనాను చాలా రకాల జ్యూసుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనం తినే ఆహారంలో పుదీనా ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ కూరల్లో పూదీన వేసుకోవడం, మూడు రోజులకోసారి పూదీన రసాన్ని తాగడం చేస్తే శరీరం హైడ్రేటెడ్ గా కూల్ గా ఉంటుందట. కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శరీరాన్ని నిమిషాల్లో యాక్టివ్ చేసే శక్తి కొబ్బరి నీళ్లల్లో ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఎలక్‌ట్రోలైట్లు సంమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా కొబ్బరి నీళ్లల్లో మెండుగా ఉంటాయి. అలాగే పుచ్చకాయలో వైటమిన్ సీ తో పాటు పొటాషియం, వైటమిన్ ఏ ఉంటాయ్. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఎలక్టోరైట్లు కూడా ఎక్కువగా ఉండడంతో శరీరం యాక్టివ్ గా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ప్రతీ రోజు పడుకునే ముందు భోజనం తరువాత కొన్ని పుచ్చకాయ పళ్లను తినడం వల్ల మీ శరీరాన్ని ఎంత ఎండైనా వడదెబ్బ తగలనీయకుండా చేయగలదట. దీంతో పాటు గుండె సంబధిత వ్యాధుల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుందట. ఎండాకాలంలో తీసుకోవాల్సిన వాటిలో కీర దోసకాయ కూడా ఒకటి. దీనిని నేరుగా లేదంటే జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను కూడా బయటకు పంపిస్తుంది. అదేవిధంగా వేసవికాలంలో తీసుకోవాల్సిన వాటిలో పెరుగు కూడా ఒకటి. పెరుగును మజ్జిగ రూపంలో లేదంటే డైరెక్ట్ గా పెరుగన్నం రూపంలో కూడా తీసుకోవచ్చు. పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల అటు శరీరాన్ని చల్లబరచడంతో పాటు కావలసినన్ని పోషకాలను అందిస్తుంది.