Liver Diseases : ఈ ఏడు సంకేతాలు మీ కాలేయం ప్రమాదంలో ఉందని సూచిస్తాయి..!!

  • Written By:
  • Publish Date - November 14, 2022 / 06:57 PM IST

కాలేయం శరీరంలో ముఖ్య భాగం. ఈ కాలేయం ప్రమాదబారినపడుతుంటే…లక్షణాలు మెల్లగా కనిపిస్తాయి. శరీరంలోని ఆహారాన్ని జీర్ణం చేయడం నుంచి పిత్తాన్ని తయారు చేయడం వరకు పనిచేస్తుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు జీర్ణవ్యవస్థ సంక్రమంగా జరగదు. దీని కారణంగా ఎన్నో వ్యాధులను ఎదుర్కొవల్సి వస్తుంది. కాలేయం శరీర ఇన్ఫెక్షన్ తో పోరడాటానికి, శరీరం నుంచి విషాన్ని బయటకు తొలగించడానికి రక్తంలోని చక్కెరను నియంత్రించడానికి, కార్బొహైడ్రెట్స్ ను నిల్వ చేయడానికి, ప్రొటీన్లను తయారు చేయడానికి సహాయపడుతుంది. కాలేయం మొత్తం శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. కాలేయం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది.

కాలేయం చెడిపోయిందనడానికి సంకేతాలు
కాలేయం ప్రమాదబారిన పడినప్పుడు జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఆకలి ఉండదు. బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. సాధారణంగా దీని లక్షణాలు మొదట్లో కనిపించవు. కానీ తర్వాత తీవ్రరూపం దాల్చుతాయి. ఆల్కహాల్, అధిక బరువు, కొవ్వు…ఇవ్వన్నీ కూడా మీ కాలేయానికి శత్రువులు. కాలేయంలో ఏదైనా సమస్య ఉందంటే..దానిని అస్సలు విస్మరించకూడదు.

1. మలం రంగులో మార్పు
మీ కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే.కాలేయంలో ఏర్పడిన పైత్య లక్షణాల వల్ల మలం నల్లగా మారుతుంది. అంటే మీ కాలేయం ప్రమాదంలో ఉందని అర్థం.

2. వాంతులు లేదా వికారం
కాలేయ రుగ్మత చాలా సాధారణ లక్షణం. ఎందుకంటే ఈ స్థితిలో కాలేయం విషాన్ని ఫిల్టర్ చేయలేకపోతుంది. టాక్సిన్స్ రక్తం ప్రవాహంలో పేరుకుపోతాయి. దీంతో వాంతులు లేదా వికారం వస్తుంది.

3. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్
ఇదొక రకమైన ఫిజియోలాజికల్ రిఫ్లెక్స్. ఈ పరిస్థితిలో ఏదైనా తిన్న తర్వాత టాయిలెట్ కు వెళ్లాలి అనిపిస్తుంది. ఇలా తరుచుగా జరగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే మీరు తిన్న ఆహారాన్ని కాలేయం గ్రహించలేకపోవడమే దీనికి కారణం. ఇది పెద్దప్రేగు ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది.

4. చర్మం, కళ్లు పసుపు రంగులోకి
కాలేయ సమస్య ఉన్నట్లయితే..మీ చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. రక్తంలోని బిలిరుబిన్ అనే రసాయనం దీనికి కారణం. కొన్ని సమస్యల కారణంగా కాలేయం దీనిని సమర్థవంతంగా ప్రాసెస్ చేయదు. కాబట్టి ఈ సంకేతాలు మీ శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. కాలేయం దెబ్బతినడం వల్ల చర్మం కూడా స్కాబ్ మొదలవుతుది. ఇది దురదను కూడా కలిగిస్తుంది.

5. మూత్రం రంగులో మార్పు
కాలేయ సమస్య ఉన్నప్పుడు మూత్రం రంగులో తేడాగా ఉంటుంది. అది బిలిరుబిన్ రసాయనాన్ని విచ్చిన్నం చేయలేకపోతుంది. దాని కారణంగా కాలేయంలో బిలిరుబిన్ స్థాయి పెరగడం ప్రారంభం అవుతుంది. మూత్రం రంగు కూడా మారుతుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మాత్రమే మూత్రం రంగు మారుతుంది.

6. కడుపు ఉబ్బరం
కడుపు ఉబ్బరం కాలేయ వైఫల్యానికి మరో సంకేతం. కడుపు లో ద్రవం నిండిపోతుంది. దీనిని సాధారణ భాషలో శరీరం నీరు పట్టిందని అంటుంటారు. పాదాలు చీలమండల్లో వాపు వస్తుంది. ఇది కాలేయం ప్రమాదంలో ఉందని తెలపడానికి ఒక సంకేతం.

7. ప్రొటీన్స్ ఉత్పత్తి చేయలేకపోతుంది
కాలేయ వైఫల్యం వల్ల అవసరమైన ప్రొటీన్లు ఉత్పత్తి చేయలేపోతుంది. దీంతో రక్తనాళాలు గాయపడతాయి.