Site icon HashtagU Telugu

Kidneys Health: కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి!

Health Tips

Health Tips

Kidneys Health: కిడ్నీ మానవ శరీరంలో కీలకమైన అవయవం. దాని ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మొత్తం శరీరంపై ప్రభావం పడుతుంది. తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. తక్కువ నీరు తాగడం, అధిక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్, మద్యం, ధూమపానం వంటి అలవాట్లు కిడ్నీలకు (Kidneys Health) అత్యంత హాని కలిగిస్తాయి. ఈ చెడు అలవాట్లను నియంత్రించకపోతే కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్‌లో చేర్చడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్యాటీ ఫిష్ (సాల్మన్, మాకేరెల్)

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో సమృద్ధిగా ఉండే ఫ్యాటీ ఫిష్ శరీరంలో వాపును తగ్గిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అధిక రక్తపోటు కిడ్నీ దెబ్బతినడానికి ప్రధాన కారణం. ఫ్యాటీ ఫిష్ కిడ్నీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారానికి 1-2 సార్లు గ్రిల్ చేసిన లేదా బేక్ చేసిన ఫ్యాటీ ఫిష్‌ను తినవచ్చు.

ఆపిల్ (సేబు)

ఫైబర్‌తో సమృద్ధిగా ఉండే ఆపిల్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం కిడ్నీ రోగులకు మేలు చేస్తుంది. రోజూ ఉదయం అల్పాహారంలో ఒక ఆపిల్ తినడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

వెల్లుల్లి (గార్లిక్)

వెల్లుల్లి సహజ డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీరం నుండి టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది. దీనివల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో 1-2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమలవచ్చు లేదా కూరల్లో కలిపి తినవచ్చు.

బ్రోకలీ

ఫైబర్, విటమిన్ C, K, యాంటీఆక్సిడెంట్స్‌తో సమృద్ధిగా ఉండే బ్రోకలీ కిడ్నీని డిటాక్స్ చేయడంలో.. కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీనివల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. బ్రోకలీని ఆవిరిలో ఉడికించి, స్టీమ్ చేసి, లేదా కూరగా తయారు చేసి తినవచ్చు.

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్ కిడ్నీకి సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడతాయి. ఇందులో ఉండే యాంథోసయానిన్ అనే యాంటీఆక్సిడెంట్ వాపును తగ్గిస్తుంది. కిడ్నీని దెబ్బతినకుండా కాపాడుతుంది. బ్లూబెర్రీస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి, దీనివల్ల డయాబెటిక్ కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. బ్లూబెర్రీ స్మూతీ తయారు చేసి లేదా పెరుగుతో కలిపి అల్పాహారంలో తినవచ్చు.

Also Read: HCU Land Issue : IAS స్మిత సభర్వాల్ తగ్గేదేలే..!

కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదనపు చిట్కాలు