Causes of Headache : మీకు నిద్రలేవగానే తలనొప్పి వస్తుందా.? అయితే కారణం ఇదే కావచ్చు..!!

గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కళ్లు తెరిచినప్పుడు విపరీతమైన తలనొప్పి రావడం.. ఇలామీకు ఎప్పుడైనా జరిగిందా?

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 04:52 PM IST

గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కళ్లు తెరిచినప్పుడు విపరీతమైన తలనొప్పి రావడం.. ఇలామీకు ఎప్పుడైనా జరిగిందా? ఎంత నిద్రపోయినా సరే…లేచకా తలనొప్పి బాధిస్తుంది. కొన్నిసార్లు ఉదయం తలనొప్పికి కారణం నిద్ర లేకపోవడం, హ్యాంగోవర్ లేదా తగినంత నీరు తాగకపోవడం. మీరు నిద్రలోనుంచి మేల్కొన్నప్పుడు తలనొప్పికి దారితీసే కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇలా మీకు తరచుగా జరిగితే…దానిని పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. అప్పుడప్పుడు ఉదయాన్నే తలనొప్పి వస్తుందంటే మీరు ఏదైనా ఒత్తిడి కానీ ఆందోళన కానీ ఎదుర్కొంటే వచ్చే అవకాశం ఉంటుంది.  అలా అని ప్రతిరోజూ ఉదయాన్నే తలనొప్పి వస్తుందంటే దానిపట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే మీ శరీరంలో ఏదో అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతున్నాయన్నదానికి ఇది సంకేతం కావచ్చు.

ఉదయాన్నే వచ్చే తలనొప్పి ఇలా ఉంటుంది:
క్లస్టర్ తలనొప్పి: కళ్ల చుట్టూ తీవ్రమైన తలనొప్పి
మైగ్రేన్: తీవ్రమైన తలనొప్పి ఉంటుంది.
సైనస్: కళ్ళు, ముక్కు, నుదిటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కారణగా సైనస్ తలనొప్పి రావచ్చు.

ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి:

నిద్ర రుగ్మతలు:
మానసిక స్థితి, నిద్రను నియంత్రించే మెదడులోని ఒక భాగం తలనొప్పిని ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి కూడా ఉదయం తలనొప్పికి ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో స్లీప్ వాకింగ్ ..దిండు పై తలపెట్టి పడుకోవడం.. సరిగ్గా నిద్రపోకపోవడం ఇవన్నీ కూడా తలనొప్పికి కారణం.

సరైన సమయానికి నిద్రలేకపోవడం:
నేటికాలంలో చాలామంది ఉద్యోగులు రాత్రిళ్లు పనిచేస్తుంటారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వీరిలో షిఫ్టు టైమింగ్స్ ఉంటాయి. రాత్రిళ్లు మేల్కొని పనిచేయడం వల్ల శరీరం దెబ్బతింటుంది. నిద్రను భంగం వాటిల్లుతుంది. తద్వారా ఉదయం తలనొప్పికి కారణం అవుతుంది.

ఒత్తిడి:
ఒత్తిడి, ఆందోళన లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉదయాన్నే తలనొప్పికి కారణమవుతాయి. ఒత్తిడి లేదా మానసిక రుగ్మతలు కూడా నిద్ర రుగ్మతల వస్తాయి.

మెదడు కణితి
తరచుగా ఉదయం తలనొప్పికి మెదడు కణితి కూడా కారణం కావచ్చు. తలనొప్పి ఉన్నప్పుడు మాట్లాడలేకపోవడం, దృష్టిలోపం, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. స్ట్రోక్ లేదా అధిక రక్తపోటు కూడా ఉదయాన్ని తలనొప్పికి కారణం కావచ్చు.