Site icon HashtagU Telugu

Heart Diseases: భారత్లో ఎక్కువగా గుండె జబ్బులు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయా.. అధ్యయనం ఏం చెబుతోందంటే?

Heart Problems

Heart Problems

సాధారణంగా గుండె జబ్బులు రావడం అన్నది సహజం. అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే చాలామంది గుండె జబ్బులు రావడానికి జన్యు రూపం అని కూడా భావిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ గుండె జబ్బులు అన్నవి ఎక్కువగా భారతదేశంలోని ప్రజలకే వస్తున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయుల ఆహారం వేరుగా, ఆరోగ్య సుగుణాలతో ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయుల్లో, దక్షిణాసియా వాసుల్లో గుండె జబ్బుల ముప్పు రెట్టింపు ఉంటోంది. ప్రపంచ గుండె జబ్బుల బాధితుల్లో 60 శాతం భారత్ లోనే ఉన్నారు. కానీ, ప్రపంచ జనాభాలో భారతీయులు 20 శాతంలోపే ఉండడాన్ని గమనించాలి. అయితే ఈ గుండె నొప్పి కారణంగా కొందరికి ప్రాణాంతక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, అకాల మరణానికి కారణమవుతున్నారని కనుగొన్నారు. భారతదేశంలో గుండెపోటు వల్ల కలిగే దుష్ప్రభావాల పై అవగాహన పెరుగుతోందని చెబుతున్నారు. భారతీయ అమెరికన్లలో ఇలాంటి గుండె పోకడలు గమనించబడ్డాయని వైద్యులు తెలిపారు.

వ్యక్తి భారతదేశానికి చెందినవాడైనా లేక ఇతర దేశాల్లోని భారతీయుడైన ఇది వర్తిస్తుందని వైద్యులు తెలిపారు. అయితే అమెరికా యూరోప్ వారితో పోల్చుకుంటే భారతదేశంలోని ప్రజలు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అమెరికా యూరోప్ వాళ్లు కూడా జంక్ ఫుడ్ తింటున్నారు కదా అంటే.. ప్రతి జాతి కూడా కొన్ని గుండె జబ్బులకు గురవుతూ ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ప్రజలు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.