Kismis: పురుషులు కిస్మిస్ తినడం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయా?

ప్రస్తుతం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యం పై ప్రత్యేక

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 06:30 AM IST

ప్రస్తుతం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధను వహిస్తున్నారు. మరి ముఖ్యంగా రోగ నిరోధక పెంచుకోవడంతో పాటుగా ఇతర వ్యాధుల భారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవాలి. అందుకోసం ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్న పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఎండుద్రాక్షలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇందులో చక్కెర, కేలరీలు, అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన వాటిల్లో కిస్మిస్ కూడా ఒకటి. డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఈ కిస్మిస్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉంటాయి.

వీటిని పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరు ఇష్టపడి తింటూ ఉంటారు. రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. దీనిలో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది. అంతే కాకుండా ఎముకలకు సంబంధించిన ఆస్టియో పోరోసిస్‌ను రాకుండా కాపాడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలకు ఎండు ద్రాక్ష చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. ప్రతీ రోజు తింటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఎండుద్రాక్షలో రాగి, విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అలాగే ఇవి ప్రతీ రోజు పిల్లలకు ఇస్తే వారి మెదడు మరింత చురుకుగా పని చేయడంలో సహాయ పడుతుంది.

అదేవిధంగా కిస్మిస్ పురుషుల్లో శృంగార సామర్థ్యం పెంచడానికి, లైంగిక జీవితం మెరుగు పడడానికి కూడా సహాయ పడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. అలాగే వీటిని చలికాలంలో తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు దరిచేరవు. బరువు తగ్గాలనుకునే వారు రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది..