Site icon HashtagU Telugu

Buttermilk: మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే?

Mixcollage 04 Feb 2024 12 19 Pm 1539

Mixcollage 04 Feb 2024 12 19 Pm 1539

మజ్జిగ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మజ్జిగను బాగా తాగాలి అని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కానీ మనలో చాలామంది మజ్జిగ తాగడానికి అస్సలు ఇష్టపడరు. కానీ వాటి వల్ల ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మజ్జిగను తాగకుండా అసలు ఉండలేరు. అంతేకాకుండా ఇంతవరకు అలవాటు లేని వారు కూడా మజ్జిగ అంటే తెగ తాగేస్తారు. నీళ్ల విరోచనాలు కానీ, రక్త విరోచనాలు, జిగట విరోచనాలు అవుతున్న సమయంలో మజ్జిగ వాడటం చాలా అవసరం.

జిగట విరోచనాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి నిదానంగా వ్యాపించి మనిషిని రక్తహీనతకు గురిచేస్తాయి. వీటివల్ల క్రమేపి నీరసం వస్తుంది. ఇలాంటి అమీబియాసిస్ తగ్గాలంటే లీటర్ల కొద్దీ మజ్జిగ తాగాలి. అయితే మజ్జిగ వాడేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించాలి. మజ్జిగలో వెన్న ఉండకూడదు. ఇది హృద్రోగులకు దారి తీయవచ్చు. కాబ్బటి వెన్నలేని పల్చని నీళ్ల మజ్జిగ వాడితే మంచిది. వేసవి కాలంలో దాహం తీర్చుకోవటానికి బజార్లో దొరికే సోడాలు,వాటర్ తాగటం కంటే కూడా మజ్జిగను తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. వడదెబ్బ తగలదు. దాహం తీరుతుంది. మజ్జిగలో అల్లం, కరివేపాకు వేసుకుంటే మరి మంచిది.

పూర్వకాలంలో రాత్రిపూట అన్నంలో పాలుపోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తోడు పెట్టి ఉదయాన్నే దాన్ని అల్పాహారంగా తీసుకునేవాళ్ళు. దాని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద మందులు వాడేటప్పుడు చాలా మందులు మజ్జిగతోనే వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మజ్జిగ అంటే పెరుగులో కాసిని నీళ్లుపోస్తే వచ్చేదే అనుకోవద్దు. అది అసలు మజ్జిగ కాదు. పెరుగుకు, మజ్జిగకు చాలా తేడా ఉంటుంది. పెరుగు రాత్రి పూట వేసుకుంటే అయుక్షిణం అంటారు. కానీ మజ్జిగకు అలాంటివి ఏమి లేవు. పెరుగును బాగా కవ్వంతో నురుగు వచ్చే వరకు చిలకరించితేనే మజ్జిగ వస్తుంది. అంతేకాని పెరుగులో కాసిన్ని నీళ్లు పొసి కలిపితే మజ్జిగ అయిపోదు.