Custard Apple: సీతాఫలం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

సీతాఫలం.. ఈ పండును ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ పండుని ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ పండు వల్ల ఎన్నో రకాల

Published By: HashtagU Telugu Desk
Mixcollage 19 Dec 2023 08 38 Pm 5830

Mixcollage 19 Dec 2023 08 38 Pm 5830

సీతాఫలం.. ఈ పండును ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ పండుని ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చలికాలంలో ఈ పండ్లు మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి రకరకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఈ పండులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అవి రక్త నాళాలలో ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

ఇది కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పక్షవాతంవంటి వ్యాధులను నివారిస్తుంది. అధిక ఆక్సీకరణ ఒత్తిడి క్యాన్సర్, గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. సీతాఫలంలో కౌరినోయిక్ యాసిడ్, విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఈ పండులోని ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణాశయాన్ని మంట వంటి వ్యాధుల నుంచి కాపాడి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులో విటమిన్ నియాసిన్ ఉంటుంది.

నియాసిన్ విటమిన్ వినియోగం కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి అనవసరంగా పెరిగితే, అది ఆరోగ్యానికి హానికరం. సమతుల్య కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడంలో సీతాఫలం సహాయపడుతుంది. ఈ పండ్లు రక్తహీనతను నివారిస్తాయి. ఫోలేట్ లోపం వల్ల కూడా రక్తహీనత రావచ్చు. ఫోలేట్-రిచ్ పుడ్ తీసుకోవడం ఫోలేట్ లోపం, రక్తహీనత ప్రమాదాన్ని నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. వైద్యులు ప్రకారం, సీతాఫలంలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. మీరు మీ ఆహారంలో ఇతర ఆహార పదార్థాలతో పాటు సీతాఫలం చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

  Last Updated: 19 Dec 2023, 08:40 PM IST