The World’s Costliest Mango : వామ్మో కేజీ మామిడి పండ్లు లక్షపైనేనా..?

ముఖ్యంగా వేసవి లో లభించే మామిడి పండ్లకు ఇంకాస్త ఎక్కువగా ఉటుంది. సమ్మర్‌‌లో మామిడి పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 02:46 PM IST

సమ్మర్ (Summer ) వచ్చిందంటే చాలు..పుచ్చకాయ , కొబ్బరి బొండం, మామిడి పండ్ల (Mango)కు ఫుల్ గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా వేసవి లో లభించే మామిడి పండ్లకు ఇంకాస్త ఎక్కువగా ఉటుంది. సమ్మర్‌‌లో మామిడి పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి. మామిడిపండ్లలో బోలెడు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం తో వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మామిడి పండ్లను ఎక్కువగా తింటే గడ్డలు వస్తాయని, వేడి చేస్తాయని చాలామంది భయపడతారు.

కానీ మామిడి పండ్లను అదేపనిగా అతిగా తినేవారికి మాత్రమే ఆ సమస్యలు వస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు కాయలు చొప్పున తినేవారికి ఎలాంటి సమస్య ఉండదు. పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా. అయితే చాలామందికి కొన్ని మామిడి పండ్ల రకాలు మాత్రమే తెలుసు..అవి మాములుగా ఎక్కడైనా అతి తక్కువ ధరలకే లభిస్తాయి. కానీ కొన్ని రకాల మామిడి పండ్లు ఉంటాయి..అవి కొనాలంటే లక్షలు పెట్టాల్సిందే. కేజీ లక్షకు పైగానే ఉంటాయి. మరి ఆ మామిడి పండ్లు ఏంటో..ఇప్పుడు చూద్దాం.

* కోహితూర్ మామిడి (Kohitur Mango)
* మియాజాకి మామిడి (Miyazaki Mango)
* అల్ఫోన్స్ మామిడి (Alphonso Mango)
* నూర్జహాన్ మామిడి (Noorjahan Mango)
* సింధ్రి మామిడి (Sindri Mango)

కోహితూర్ మామిడి : – ఈ మామిడి 18వ శతాబ్ధం నుంచి అందుబాటులో ఉంది. ఈ మామిడి పండ్లు అన్ని మామిడిలా కాకుండా విలక్షణ రంగు, రుచి, రూపాన్ని కలిగి ఉంటుంది. నవాబుల కోసం ఓ ఉద్యానవనవేత్త ఈ రకాన్ని పండించినట్లు తెలుస్తుంది. ఈ మామిడి ఇప్పుడు చాలా అరుదుగా దొరుకుతుంది. పశ్చిమ బెంగాల్​లో మాత్రమే దీనిని పండిస్తున్నారు. అయితే దీని ధర మూడు వేల నుంచి 12 వేల వరకు ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

మియాజాకి మామిడి ల – జపాన్​లో పెరిగే ఈ మామిడికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రపంచంలో ఏ మామిడికి లేనంత ధర ఈ మామిడికి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే కిలో మియాజాకి మామిడి ధర రెండు లక్షలకు పైమాటే. దీని రంగు ఎరుపుగా, బర్గంటిలో ఉంటుంది. రుచిలో అత్యంత మధురాన్ని అందిస్తుంది. పెద్ద సైజ్​లో, వాసన, స్వీట్​నెస్​కు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ మధ్య ఇండియాలో కూడా పండించడం మొదలు పెట్టారు.

అల్ఫోన్స్ మామిడి ల – ఈ మామిడి పండ్ల రాజుగా పిలుస్తుంటారు. ఇది ఇండియాలో బాగా ఫేమస్, దీనిని రత్నగిరి, దేవ్​గడ్, కొంకణి ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు. గుజరాత్​లో కూడూ ఇవి విరివిగా దొరుకుతాయి. గత ఏడాది ఓ ఆన్​లైన్​ స్టోర్​లో ఇది విపరీతంగా అమ్ముడుపోయింది. 25 కోట్ల విలువైన మామిడి పండ్లను ఆర్డర్ చేశారంటే దీనికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని ధర కిలో రూ.1,500 ఉంటుంది.

నూర్జహాన్ మామిడి : – ఈ మామిడి దాదాపు అడుగు పొడువు వరకు పెరుగుతుంది. దీనిని మామిడి పండ్లలో రాణిగా చెప్తారు. ఒక్క మామిడి 3.5 కిలోలవరకు బరువు ఉంటుంది. అయితే సీజన్​లో ఒక్కో ముక్క ధర రూ. 1,000 వరకు ఉంటుంది.

సింధ్రి మామిడి : ఇండియా, పాకిస్థాన్​లో అరదుగా దొరికే మామిడి పండ్లలో సింధ్రి మామిడి ఒకటి. ఇవి ప్రత్యేకమైన తీపి రుచిని, సువాసనను కలిగి ఉంటుంది. దీని సైజ్ లో పెద్దవిగా, మృదువైన, పసుపు రంగులో ఉంటాయి. సారవంతమైన నేలలో వెచ్చని వాతావరణంలో వీటిని పండిస్తే మంచి రుచి వస్తుందని చెపుతుంటారు. మార్కెట్లో ఒక్క పండు ధర మూడువేల వరకు ఉంటుంది. ఇలా పలు రకాల మామిడి పండ్లు విపరీతమైన ధరలతో అందుబాటులో ఉంటాయి. కాస్త మనవాళ్లు వీటి ధరలు చూసి కొనేందుకు కాస్త వెనకడుగు వేస్తారు కానీ ఇతర దేశస్థులు మాత్రం తెగ కొంటారు.

Read Also :