Site icon HashtagU Telugu

Recipe : పప్పు, పులుసు, నెయ్యి, అన్నం…వీటిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Dal Rice

Dal Rice

వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో రోగాలు చుట్టుముడుతుంటాయి. చిన్న చిన్న సమస్యల వల్ల శరీరంలో ఇమ్యూనిటీ తగ్గి ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఈ సమస్యలన్నింటినీ నివారించేందుకు మన రోజువారీ మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మన సంప్రదాయ వంటలు మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి. దీనికి ఉదాహారణ పప్పు, పులుసు, నెయ్యి.

పప్పు, పులుసు, అన్నం:
వేడివేడి అన్నం పైన చెంచా నెయ్యి వేసి కాస్త వేడి పప్పు పులుసుతో భోజనం చేయడం మన సంప్రదాయ వంటల ముందు ఇంకేమీ లేదు. దీని ముందు బిర్యానీ కూడా పనికిరాదు. దక్షిణభారతదేశంలో ప్రసిద్ధ వంటకాల్లో ఇది ఒకటి. దీన్ని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు. అన్నంలో ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గొప్ప ఆహారంగా పరిగణించబడే, నెయ్యి రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ప్రధానంగా నెయ్యిలో విటమిన్ ఎ, ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 అంశాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాల వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. ప్రధానంగా శరీర కండరాల అభివృద్ధిలో, ఎముకల పటిష్టతలో, వ్యాధి-రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో వాటి పాత్ర మరువలేనిది. కాబట్టి, శరీరానికి కావాల్సిన ప్రొటీన్ మూలకాలు ఈ అన్నం పులుసులో లభిస్తాయి కాబట్టి వారంలో కనీసం రెండు సార్లైనా దాల్ రైస్ తినడం మర్చిపోకండి! పప్పుధాన్యాలలో ప్రధానంగా ప్రొటీన్ మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన మంచి కొవ్వు పదార్ధం కూడా ఈ పప్పులో ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇది పౌష్టికాహారం అనడంలో సందేహం లేదు.

జీర్ణవ్యవస్థకు చాలా సహాయకారిగా ఉంటుంది:
ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవనశైలి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, అజీర్తి సమస్య కనిపించడం ఇందుకు ఉదాహరణ. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఈ విషయంలో, పప్పుచారు అన్ని అజీర్ణ సమస్యలకు చాలా మంచిది. ఎందుకంటే పప్పు చారు తయారుచేసేటప్పుడు దాని రుచి ఆరోగ్యకరమైన ప్రభావాలను పెంచడానికి, జీలకర్ర ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగడంతోపాటు అజీర్ణ సమస్యలు దూరమవుతాయి.

మధుమేహం ఉన్నవారికి:
డయాబెటిస్ ఉన్నవారి గురించి మనందరికీ తెలుసు.. తినే ఆహార పదార్థాల విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా తీసుకుని, కఠినమైన ఆహారం పాటించాలి. మధుమేహంతో బాధపడేవారు పప్పు పులుసును మితంగా తినవచ్చు. వంట చేయడానికి ఉపయోగించే పప్పులో ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వలన, రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చూసుకోవచ్చు.

కండరాల పెరుగుదలకు:

వారానికి కనీసం రెండుసార్లయినా పప్పు పులుసు తినడం అలవాటు చేసుకుంటే శరీర కండరాలకు సహజంగానే వాటి ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు అందుతాయి.