స్త్రీలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే వారిని ఎక్కువగా ఆందోళనకు గురిచేసేది జుట్టు రాలడం (Hair Fall). ఎన్ని ఉత్పత్తులు (Products) వాడినా జుట్టు రాలడం (Hair Fall) ఆగడం లేదన్నది అందరి ఫిర్యాదు (Complaint). దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సులభంగా లభించే వస్తువులు మీ సమస్యను పరిష్కరిస్తాయి.
లావెండర్ ఆయిల్:
ఈ లావెండర్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు అవసరమైన అంశాలను కలిగి ఉంటుంది. దీన్ని మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మూలాల నుండి దృఢంగా మారుతుంది. దీన్ని రోజుకు ఒకసారి అప్లై చేసి జుట్టును ఆవిరి పట్టడం మంచిది
రోజ్‌మేరీ ఆయిల్:
ఈ రోజ్‌మేరీ ఆయిల్‌ను మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది ,జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. స్నానానికి 1 గంట ముందు అప్లై చేయడం మంచిది.
ఎగ్ మాస్క్:
గుడ్డులోని పచ్చసొనను ఒక గిన్నెలో వేసి, కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమానికి తేనె కలిపి తలకు పట్టించాలి. సుమారు 1 గంట తర్వాత తలస్నానం చేయండి.
కొబ్బరి పాలు:
కొబ్బరి పాలలో జుట్టుకు అవసరమైన కొవ్వులు ,ప్రోటీన్లు కూడా ఉన్నాయి. ఈ కొబ్బరి పాలలో మెంతి గింజల పొడిని కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ బరువు తగ్గడమే కాకుండా జుట్టు రాలడంలో కూడా సహాయపడుతుంది. మీ జుట్టు పొడవును బట్టి గ్రీన్ టీ బ్యాగ్‌లను వేడి నీటిలో నానబెట్టండి. దీన్ని మీ జుట్టుకు పట్టించి కడగాలి. తర్వాత మళ్లీ చల్లటి నీటిలో తలస్నానం చేయాలి..
బీట్‌రూట్ జ్యూస్:
బీట్‌రూట్ మీ జుట్టుకు అందమైన రంగును ఇస్తుంది. శిరోజాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ తురుము వేసి కలపాలి. పేస్టును వడకట్టి రసం మాత్రమే తీసుకోవాలి. దీన్ని మీ జుట్టుకు పట్టిస్తే చాలు.
కలబంద:
జుట్టు సమస్యలకు అలోవెరా దివ్యౌషధం అని అందరికీ తెలిసిందే. తాజా కలబందను తీసుకొని వారానికి 3 సార్లు జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడంలో సహాయపడుతుంది.
Also Read: Healthy Skin: అందం కోసం వీటిని ముఖంపై నేరుగా అప్లై చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?