April 1st : ఈరోజు (ఏప్రిల్ 1) నుంచి కొన్ని ఔషధాల ధరలు పెరగనున్నాయి. వీటిలో చాలా అత్యవసర ఔషధాలు కూడా ఉన్నాయి. 923 రకాల ఫార్ములాలతో కూడిన అత్యవసర ఔషధాల ధరలు(April 1st) పెరిగాయి. ఇందులో పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్, యాంటీ మలేరియల్స్, టైప్ 2 డయాబెటిస్ మందులు ఉన్నాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. పెయిన్‌కిల్లర్ అయిన డైక్లోఫెనాక్ ఇప్పుడు ఒక్కో టాబ్లెట్ ధర రూ. 2.05కు చేరింది. ఇబుప్రోఫెన్ టాబ్లెట్ల ధర రూ.71(200 Mg), రూ.1.20 (400 Mg)కు పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join
జాతీయ ఔషధాల ధరల సంస్థ (NPPA) నివేదిక ప్రకారం.. మందుల ధరల అడ్జస్ట్‌మెంట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్ణయించే హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటాపై ఆధారపడి ఉంటాయి. 2023 సంవత్సరానికి సంబంధించిన హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)తో పోలిస్తే మందుల ధరలు ఇప్పుడు 0.00551 శాతం మేర స్వల్పంగా పెరిగాయి.2024 మార్చి 30న NPPA విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారం.. 923 షెడ్యూల్డ్ ఫార్ములేషన్‌లను, 65 ఫార్ములేషన్‌ల రిటైల్ ధరల స్థిరీకరణ, సవరణలను ప్రతిపాదించారు. ఈ జాబితాలో పారాసిటమాల్, అజిత్రో మైసిన్. అమోక్సిసిలిన్, యాంఫోటెరిసిన్ బి, బెంజాయిల్ పెరాక్సైడ్, సెఫాడ్రాక్సిల్, సెటిరిజైన్, డెక్సామెథాసోన్, ఫ్లూకోనజోల్, ఫోలిక్ యాసిడ్, హెపారిన్, ఇబుప్రోఫెన్ మొదలైన మందులు ఉన్నాయి.
Also Read :Delhi Liquor Case : కవిత కు.. బెయిలా? కస్టడీ పొడిగింపా?
NLEM లిస్టులో 384 రకాల మెడిసిన్స్
2022లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) 2022ని ప్రారంభించారు. ప్రధాని మోదీ ‘సబ్కో దవాయి, సస్తీ దవాయి (Sabko Dawai, Sasti Dawai)’ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. అన్ని స్థాయిల ఆరోగ్య సంరక్షణలో సరసమైన, నాణ్యమైన మందులను పొందడంలో NLEM కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లిస్టులో మొత్తం 384 రకాల మెడిసిన్స్ ఉన్నాయి, ఇందులో కొత్తగా 34 చేర్చారు. అంతకు ముందున్న 26 మందులను తొలగించారు. కాస్ట్-ఎఫెక్టివ్, క్వాలిటీ మెడిసిన్స్ అవైలబిలిటీని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం NLEM జాబితాను రూపొందించింది. ఈ మందులు 27 రకాల చికిత్సలను కవర్ చేస్తాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు జేబు నుంచి పెట్టే ఖర్చును తగ్గించడం ప్రభుత్వ లక్ష్యం.