Site icon HashtagU Telugu

‎Winter Super Food: ఏంటి.. శీతాకాలంలో దొరికే ఉసిరి వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?

Winter Super Food

Winter Super Food

‎Winter Super Food: శీతాకాలంలో మనకు దొరికే వాటిలో ఉసిరికాయలు కూడా ఒకటి. ఉసిరికాయల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉసిరి కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉసిరి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సూపర్ ఫుడ్ అని చెప్పాలి. విటమిన్ సి కు నిలయం అని కూడా చెప్పవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు, అలర్జీలను తగ్గిస్తుందట. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.

‎ శీతాకాలంలో రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను మీరు పొందవచ్చట. అలాగే ప్రకృతి మనకు అందించిన అత్యంత విలువైన ఔషధాల్లో ఉసిరికాయ కూడా ఒకటి. ఒక చిన్న ఉసిరికాయలో ఉండే విటమిన్ సి ఒక నారింజ పండులో ఉండేదాని కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచి, శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుందట. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. శీతాకాలంలో ప్రతిరోజూ రెండు ఉసిరికాయలు తినడం వల్ల జలుబు, దగ్గు, అలర్జీ సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయట.

‎ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, ఇవి శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయని చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారికి ఉసిరికాయ చాలా మేలు చేస్తుందట. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఉసిరికాయ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందట. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదని చెబుతున్నారు. ఉసిరికాయను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా నిపుణుల సలహా మేరకు ఉసిరి తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు.

Exit mobile version