నాన్ వెజ్ ప్రియులలో ఎక్కువ శాతం మంది ఇష్టపడితే చేపలు కూడా ఒకటి. కొంతమంది చేపలు తలలు తినడానికి ఎంతగా ఇష్టపడరు. కేవలం బాడీ పార్ట్ మాత్రమే తింటూ ఉంటారు. కాగా తలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయట. ఇవి గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఒమేగా 3 రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందట. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రెగ్యులర్‌గా చేప తల తినడం వల్ల మానసిక స్పష్టత జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతాయట.
చేప తలలో ఉండే చిన్న ఎముకలు కాల్షియం ఫాస్ఫరస్‌లతో నిండి ఉంటాయట. ఈ ఖనిజాలు ఎముకలు దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం అని చెబుతున్నారు. చేప తలను కూరలో ఉడికించి తినడం వల్ల ఎముకలు బలపడతాయట. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. చేప తలలో విటమిన్ ఎ, డి, బి12 వంటి అవసరమైన విటమిన్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి కాల్షియం శోషణకు సహాయపడుతుంది, ఇది ఎముకల బలానికి రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. విటమిన్ బి12 నరాల వ్యవస్థ ఆరోగ్యానికి రక్త హీనత నివారణక సహాయపడుతుంది.
చేప తలలోని చర్మం కణజాలంలో కొలాజెన్ అధికంగా ఉంటుందట. కొలాజెన్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు సామర్థ్యాన్ని పెంచుతుందట. అలాగే వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుందట. అదనంగా, కొలాజెన్ కీళ్ల ఆరోగ్యానికి కండరాల బలానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా చేప తలను కూరలో ఉడికించడం వల్ల ఈ కొలాజెన్ శరీరానికి సులభంగా అందుతుంది. చేప తలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఇతర పోషకాలు శరీరంలో మంట తగ్గించడంలో సహాయపడతాయట. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి దీర్ఘకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రెగ్యులర్‌గా చేప తల తినడం వల్ల శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యం మెరుగవుతుందట. .