The Health Benefits of Sabja Seeds : ఎండా కాలంలో సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా..?

చాలామంది సబ్జా గింజలను తక్కువ చేయడం..ఇవేమి చేస్తాయి అని అనుకుంటారు. కానీ వీటి ఉపయోగాలు...ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు

  • Written By:
  • Publish Date - April 7, 2024 / 02:13 PM IST

ఎండాకాలం వచ్చిందంటే చాలు పసిపిల్లల దగ్గరి నుండి పెద్ద వారి వరకు అనేక అనారోగ్య సమస్యలకు గురి అవుతారు. ముఖ్యంగా చాలామంది వడదెబ్బకు గురి అవుతారు. అలాగే వేడి కారణంగా అనేక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో సబ్జా గింజలు అనేవి ఎండాకాలంలో ఎంత ఉపయోగపడతాయి. చాలామంది సబ్జా గింజలను (Sabja Seeds) తక్కువ చేయడం..ఇవేమి చేస్తాయి అని అనుకుంటారు. కానీ వీటి ఉపయోగాలు…ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు.

మరి సబ్జా గింజలు (Sabja Seeds) ఉపయోగాలు ఏంటి..? తదితర విషయాలు తెలుసుకుందాం.

శరీరాన్ని వేడి నుంచి రక్షించడంలో సబ్జా గింజలు కీలకపాత్ర పోషిస్తాయి. మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలోను వీటి పాత్ర ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. సబ్జా గింజలను పచ్చిగా తినలేరు. వీటిని నీటిలో నానబెట్టిన తరువాత తీసుకుంటే వీటి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు, మలబద్ధకం లాంటివాటికి సబ్జా గింజలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. కొబ్బరి నూనెలో సబ్జా గింజల పిండిని కలిపి రాయడంవల్ల సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులను నయం చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.

సబ్జా గింజలు శరీరంలో అమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నానబెట్టిన గింజలను తీసుకోవడం ద్వారా కడుపులోని సమస్యలను క్లియర్ చేస్తుంది. తద్వారా మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కొబ్బరి నూనెలో పిండిచేసిన సబ్జా గింజలను కలిపి.. ఆ నూనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. సబ్జా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల కొత్త చర్మ కణాలను రూపొందించడానికి అవసరమైన కొల్లాజెన్‌ను స్రవించడంలో మీ శరీరానికి సహాయపడుతుంది. సబ్జా గింజలు పొడవాటి, దృఢమైన జుట్టుకు అవసరమైన ఐరన్, విటమిన్ కె, ప్రొటీన్‌తో నిండి ఉన్నందు.. ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మీ చర్మం, జుట్టుకు అనేక రకాలుగా మేలు చేస్తుంది.

అలాగే వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం వల్ల అలాంటివి తగ్గిస్తాయి. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. పిల్లలకు తరుచు సబ్జా గింజల పానీయం తాగిస్తే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇక మహిళలు సబ్జా గింజల పానీయం తాగడం వల్ల ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవే కాక మరెన్నో ఉపయోగాలు సబ్జా గింజల పానీయం తాగడం వల్ల లభిస్తాయి. అందుకే మీరు ప్రతి రోజు సబ్జా గింజల పానీయం తాగండి.

Read Also : Sunny Leone: పెళ్ళికి ముందే నన్ను మోసం చేశాడు.. మాజీ ప్రియుడి గురించి సంచలన వాఖ్యలు చేసిన సన్నిలియోన్?