Smoking: పొగ తాగడం వల్ల కలిగే నష్టాలివే

  • Written By:
  • Publish Date - November 25, 2023 / 06:01 PM IST

Smoking: దేశంలో 10 మిలియన్ల మంది ప్రజలు ధూమపానం చేస్తున్నారని మరియు వారిలో 3-4 మిలియన్ల మంది మానేయడానికి ప్రయత్నిస్తున్నారని UKలో ఒక అధ్యయనం సూచిస్తుంది. చుట్ట, బీడీ, సిగరెట్… ఎందులోనైనా పొగాకు ఉంటుంది. అందులో ఉండే నికొటిక్​ అనే పదార్థం వల్ల పొగతాగిన మరుక్షణానికే మత్తులోకి తీసుకెళ్తుంది. ఒత్తిడి పోయి, మైండ్ రిలాక్స్ అవుతుంది. దీనికి అలవాటు పడి, పదే పదే పొగతాగుతుంటారు. కొన్నాళ్లకు అది వ్యసనంగా మారుతుంది. అప్పుడు దానివల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో నష్టాలు జరుగుతాయి. అయినా, వాటిని మాత్రం పెడచెవిన పెట్టేస్తుంటారు. కానీ, వాటి గురించి సరైన అవగాహన లేకపోతే పొగతాగేవాళ్లకే కాదు.. వాళ్ల చుట్టూ ఉండేవాళ్లకు కూడా ప్రమాదమే!

ఒత్తిడి తగ్గడానికి, ప్రశాంతత కోరుకున్నప్పుడు, స్నేహితులను కలిసినప్పుడు స్మోక్ చేస్తుంటారు. అయితే, వాళ్లలో చాలామంది స్మోక్ చేయడం వల్ల పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్​ బారిన పడుతున్నారు. స్మోకింగ్ చేసేవాళ్లకు దగ్గు వస్తుంటుంది. దాన్ని స్మోక్​ కాఫ్​ అంటారు. స్మోక్ చేసేటప్పుడు పొగతో పాటు రకరకాల క్వాంటిటీల్లో టాక్సిన్స్​ను కూడా పీలుస్తారు. వాటిలో ఉండే రసాయనాలను పీల్చడం వల్ల మంట వస్తుంది.

లంగ్స్​లో ఉన్న సిలియా డ్యామేజ్ అవుతుంది. ఊపిరితిత్తుల్లోని చిన్న కణాల్లాంటి వెంట్రుకలు (సిలియా) గాలి ద్వారా శ్లేష్మం (మ్యూకస్), చెత్త (డెబ్రిస్)​ను పట్టుకుని క్లియర్ చేస్తుంది.కానీ, స్మోక్ చేయడం వల్ల సిలియా చచ్చుబడిపోతుంది. దాంతో టాక్సిన్స్​ వెళ్లి లంగ్స్​లో చేరతాయి. దాంతో మ్యూకస్ పెరుగుతుంది. శరీరం మ్యూకస్​ని ఇష్టపడదు.. అందువల్ల దగ్గు మొదలవుతుంది. దాన్ని బయటకు పంపేవరకు దగ్గు వస్తూ ఉంటుంది. స్మోకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ ఎక్కువ